సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ,తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
news 9 channel
**ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*:
సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ,తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ తూర్పు నియోజకవర్గం,పటమట, శాంతినగర్,చిన్న వంతెన దగ్గర సెమీ క్రిస్టమస్ వేడుకలు 14 వ డివిజన్ టిడిపి నాయకులు పోతిరెడ్డి వెంకట రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు ,పాస్టర్ లు జి ప్రసాద్ కోర్నేలి, జ్యోతి మాట్లాడుతూ
క్రిస్టమస్ అంటే దేవుడు పుట్టినరోజు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు.
2025 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ దేవ దేవుడు యేసు క్రీస్తు.
ఆ దేవదేవుడు మనకు ఒక బైబిల్ అనే పవిత్రమైన గ్రంథాన్ని అందించడం జరిగింది.
మనుషులు ఏ విధంగా కలిసి ఉండాలి,శాంతిభావంగా ఎలా ఉండాలని తెలియ చెప్పిన వ్యక్తి యేసు ప్రభువు
పగవాడు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలని చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తు అన్నారు.

Comments
Post a Comment