నా కుటుంబం జోలికి వచ్చారు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: దస్తగిరి


నా కుటుంబం జోలికి వచ్చారు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: దస్తగిరి


పులివెందుల: తన తండ్రి షేక్‌ హాజీవలిపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్‌ రద్దు చేయాలని కోరారు..


పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''ఈ నెల 12న హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో వాయిదాకు వెళ్తున్నా. నా తండ్రిపై జరిగిన దాడిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా. పులివెందుల వైకాపా నాయకులకు దమ్ముంటే నన్ను టచ్ చేయాలి..


నా కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏముంది? నా కుటుంబం జోలికి వచ్చారు కాబట్టి.. వార్ వన్ సైడ్‌ అవుతుంది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. దేనికైనా సిద్ధం. పులివెందుల వైకాపా నాయకులు ఢీ అంటే ఢీ .. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'' అని పేర్కొన్నారు..

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.