కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని ,సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా! కలెక్టర్ కి వినతి పత్రం అందజేత!! అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టరేట్ వద్ద అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏ. రామంజులు, మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కై నేడు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులతో ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. టైం స్కేలు, కంటిజెంట్, పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, విద్యుత్తు, సర్వ శిక్...