విజయవాడ 31-01-2025 ప్రచురణార్ధం *రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేసాడు - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు* *చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మాత్రమే* *జగన్ మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పధకాలు అందిస్తామని ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలను నమ్మబుచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చెప్పట్టింది* *ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆలా చేయలేకపోతే ప్రజలకు తమ కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ అన్న మాట వాస్తవమా కాదా ?* *చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పులి నోట్ల తలకాయి పెట్టినట్లు ఉంటుందని ప్రజలందరూ ఆలోచించాలని ఎన్నికల ముందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు విన్నవించుకున్నారు* *కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలలో రూ 1.19 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చారు, కానీ ఎక్కడ ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదు* *వాలంటీర్లకు పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కానీ నేడు అబ్బద్దపు మాటలతో కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గొంతు కోసింది* *జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండున్నర సంవత...