నకిలీ మద్యంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట
నకిలీ మద్యంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట
*చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో నిరసన*
చిలకలూరిపేట:న్యూస్9 ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం విక్రయాలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) పోరుబాట పట్టింది. మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేసి, అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు పెరిగిపోయాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* *సమగ్ర దాడులు, కఠిన చర్యలు* పట్టణంలోని వైన్ షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, బార్ షాపులపై ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో రైడ్స్ నిర్వహించి, బాధ్యులందరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన సిట్ (SIT) లో ఉన్నది పాత అధికారులే కాబట్టి, వారు తమకు న్యాయం చేస్తారని ప్రజలు నమ్మలేరని ,ఈ నకిలీ మద్యం విక్రయాలపై సీబీఐ (CBI) తో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు


Comments
Post a Comment