ధరల నియంత్రణ పర్యవేక్షక కమిటీలను వెంటనే ఏర్పాటు చేయండి
ధరల నియంత్రణ పర్యవేక్షక కమిటీలను వెంటనే ఏర్పాటు చేయండి
డీఎస్ఓ ఎంవి ప్రసాద్ కు వినియోగ దారుల సంఘం నాయకులు విజ్ఞప్తి
నరసరావుపేట డిఎస్ఓ పరిధిలో వెంటనే ధరల నియంత్రణ పర్యవేక్షక కమిటీని మరియు డిసిబిసి కమిటీలను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నరసరావుపేటలోని డిఎస్ఓ కార్యాలయంలో వినియోగదారుల సంఘం నాయకులు డిఎస్ఓ ఎంవి ప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్లో నిత్యవసర, ఇతర వస్తువుల ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణ పర్యవేక్షణ కమిటీని మరియు డీసీబీసీ కమిటీలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించాలని వారి కోరినట్లు తెలిపారు. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి వినియోగదారుల సంఘం ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు, వినియోగదారుల సమస్యలపై జరిపిన కార్యక్రమాలు, మరియు ప్రజలకు అవగాహన కల్పిస్తూ
వినియోగదారుల సంఘం ఏర్పాటు చేసిన పోస్టర్లు వివరాలు అన్నిటితో కూడిన సమగ్ర రికార్డును డీఎస్ఓ ఎంవి ప్రసాద్ కు కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్, కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి విక్రమ్ అందజేశారు. రికార్డులు పరిశీలించి ఆయా కమిటీల్లో
తమ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిఎస్ఓని కోరారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Comments
Post a Comment