అనకాపల్లి జిల్లా పోలీసు* *పత్రికా ప్రకటన*

 *అనకాపల్లి జిల్లా పోలీసు*

*పత్రికా ప్రకటన* 



 *గౌరవ భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాజుపాలెం గ్రామం, కసింకోట మండలం తేదీ. 06-05-2024 న బహిరంగ సభకు విచ్చేయు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు:* *జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఐపిఎస్* 


*అనకాపల్లి, మే 6:*

గౌరవ భారతదేశ ప్రధాని గారు తేది.06.05.2024 కసింకోటమండలం, రాజుపాలెం గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన  బహిరంగ సభ కు విచ్చేయచున్న సందర్భంగా ప్రజల సౌకర్యార్థం భారీ వాహనాలు, కంటైనర్లు, టిప్పర్లు లారీలు మొదలగు వాహనాలను ట్రాఫిక్ దృష్ట్యా మళ్లింపు చేయడం జరుగుతుంది.


*06.05.2024 న  మధ్యాహ్నం 13.00 గంటల నుండి 18.00 వరకు మాత్రమే ఈ ట్రాఫిక్ మళ్లింపు భారీ వాహనాలకు ఉంటుంది.* 


*విశాఖపట్నం నుండి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు విశాఖపట్నం నుండి బయలుదేరి లంకెలపాలెం జంక్షన్ - పరవాడ - అచ్యుతాపురం - ఎలమంచిలి - రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి.* 


*తుని నుండి విజయనగరం , విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు* తుని - రేగుపాలెం జంక్షన్ - ఎలమంచిలి బైపాస్ -

అచ్యుతాపురం - పరవాడ - లంకెలపాలెం జంక్షన్- అసకపల్లి జంక్షన్ మీదుగా విజయనగరం, శ్రీకాకుళం లేదా దేశపాత్రునిపాలెం నుండి జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు.


*సబ్బవరం జాతీయ రహదారి మీదగా వచ్చే  వాహనాలు* అసకపల్లి - లంకెలపాలెం జంక్షన్ - పరవాడ - అచ్యుతాపురం -  ఎలమంచిలి బైపాస్ - రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా  తుని వైపు వెళ్లవచ్చు. 


*చోడవరం నుండి తుని వైపు వెళ్లే వాహనాలు అనకాపల్లి బ్రిడ్జి - మునగపాక - పూడిమడక రోడ్డు - అచ్యుతాపురం జంక్షన్ - ఎలమంచిలి బైపాస్- రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు.* 


*ప్రజలు రేపు జరగబోవు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా ప్రయాణం చేయాలని* ప్రజలకు విజ్ఞప్తి చేసిన 

జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ,ఐపీఎస్ గారు


*జిల్లా పోలీస్ కార్యాలయం,* 

*అనకాపల్లి.*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి