Posts

Showing posts from May, 2026

ఎమ్మెల్యే ప్రత్తిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాధవ్ సింగ్

Image
 ఎమ్మెల్యే ప్రత్తిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాధవ్ సింగ్  చిలకలూరిపేట  మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ్ సింగ్ వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పుష్పగుచ్ఛం అందజేసి, జ్ఞాపిక (మెమొంటో) బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాధవ్ సింగ్ మాట్లాడుతూ, రెండున్నర దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు ఎనలేని సేవలు అందించారని, ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సేవలో నిరంతరం అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు మహిళా నాయకురాలు వనితా బాయ్, అద్దంకి అనితా బాయ్, దుర్గాబాయి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరి కి పూర్తి అవగాహన

Image
*వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం*  ఆర్టీసీ డిఎం యద్దనపూడి వేణుబాబు ఆర్టీసీ బస్టాండ్‌లో కరపత్రాల పంపిణీ – ప్రయాణికులకు అవగాహన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని చిలకలూరిపేట ఆర్టీసీ డీఎం యద్దనపూడి వేణుబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారుల హక్కుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వినియోగదారులేనని, మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేయడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ సేవలు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసే వారందరూ వినియోగదారుల హక్కుల చట్ట పరిధిలోకి వస్తారని వివరించారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, వస్తువుల నాణ్యత, గ్యారెంటీ, వారంటీ వంటి అంశాలను పరిశీలించే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందన్నారు. నాణ్యమైన వస్తువు లేదా సేవ పొందే హక్కుతో పాటు ...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు..

Image
 న్యూస్ 9 ఛానల్ కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు.. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకుడు మరియు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నే శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 మార్కులపైగా 20 మంది విద్యార్థులకు రావడం శుభ పరిణామం అని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో చదివి జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుని అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతామని అన్నారు. రాబోయే కాలంలో ఈ పాఠశాల నుంచి మరింత మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి విజయలక్ష్మి, ఉపాధ్యాయుల సంఘం నేత కొనకల్ల రెడ్డమ్మ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోకినాల అజ్రయ్య.. తదితరులు పాల్గొ...

అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్..

Image
 న్యూస్  9 ఛానల్ *అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్* ఎన్టీఆర్ జిల్లావిజయవాడ :  అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ (ఐహెన్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజనందన్ విజ్ఞాన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బట్టు రాజేష్ ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు సైతం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ నందన్ విజ్ఞాన్, బట్టు రాజేష్ విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) కనీస వసతులు లేవన్నారు. 48 శాతం మంది వైద్యులు, 62 శాతం మందులు, 71 శాతం ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా విఫలమైందదన్నారు. ఉచిత వైద్యం అందించకుండా ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం సరి కాదన్నారు. రాజ్యాంగంలో...

పారిశుద్ధి అవగాహన కార్యక్రమం

Image
 ఈరోజు సాలూరులోని కోటవీధిలో పారిశుద్ధి అవగాహన కార్యక్రమం జరిగింది.

సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు

Image
 సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు చిలకలూరిపేట:గుంటూరు - కర్నూలు హైవేపై  నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాతులూరు నుండి చందవరం వెళ్లే దారిలో ఉన్న AMR సంస్థ చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు, రైతులు భారీ ధర్నా చేపట్టారు. తమ వాహనాల రాకపోకలపై ప్రతిసారి డబ్బులు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హైవేపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు.ఈ క్రమంలో రైతులు, AMR సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తక్షణమే ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు

Image
 గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు* తేది 12.05.2026 నాడు సాలూరు మండలం గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. హనుమాన్ విగ్రహానికి పూల మాల వేసి అష్టోత్తర శతనామల పూజ చేసి హారతి ఇచ్చి పులిహార్ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకు అందజేయటం జరిగింది. గుమడాము గ్రామంలో యువకులు ఐకమత్యంతో సేవా కార్యములు చేస్తూ ఈ రోజు పూజ చేసిన పంతులు గారికీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కోరుకొండ అప్పారావు గారు శాలువతో సన్మానం చేసి ఫలహారం సమర్పించుకున్నారు. గ్రామంలో యువకులు ఐకమత్యంతో మంచి పనులు చేస్తున్నందుకు అభినందనలు తెలియచేశారు.

ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి బ్రహ్మ కుమారీస్

Image
ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ  సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి  బ్రహ్మ కుమారీస్ తే.12.05.2026 ది.మంగళవారం ఉదయం బసినేని పల్లి గ్రామం, సీతారాంపురం మండలం నెల్లూరు జిల్లా లో ఆశా వర్కర్స్ కి మరియు వైద్య సేవలు చేస్తున్న డాక్టర్స్ & నర్సెస్ లకు  *ఇంటర్నేషనల్ నర్సెస్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య (బొబ్బిలి సెంటర్ ఇన్చార్జి) గారు నర్సులు కు  రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలి అని సందేశం ఇస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ కు కూడా ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు

చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి

Image
 *డ్రైవర్‌పై  దాడి: ఆసుపత్రిలో చికిత్స* చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన  చిలకలూరిపేట డిపోకు చెందిన డ్రైవర్ గంటూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో బస్సును తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో చౌడవరం వద్ద ప్రయాణికులు దిగాల్సి ఉండగా, అక్కడ వర్షం కురుస్తుండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా బస్సుకు అడ్డంగా రావడంతో కండక్టర్ మరియు డ్రైవర్ అతడితో మాట్లాడారు. అయితే, బస్సు ఎందుకు ఆపలేదని ఆగ్రహించిన సదరు వ్యక్తి, తన అనుచరులతో కలిసి డ్రైవర్‌పై దాడికి దిగాడు. దాదాపు 10 మందికి పైగా వ్యక్తులు డ్రైవర్‌ను, కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారని ఈ దాడిలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురై, బీపీ పడిపోవడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు కండక్టర్ ఫోన్‌లోని వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించడమే కాకుండా, డ్రైవర్ లైసెన్స్ జిరాక్స్ తీసుకుని బెదిరిం...

మదర్స్ డే శుభ సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్

Image
మదర్స్ డే శుభ  సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్* తే.10.05.2026 ది.ఆదివారం ఉదయం గాదెలవలస గ్రామం, బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా లో గ్రామీణ మహిళలకు *మదర్స్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య  గారు మహిళలకు సగౌరవంగా శాలువాలతో సన్మానం చేసి వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ , గ్రామ అభివృద్ధి కోసం *రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నారని ఆ మహిళలు చెప్పారు* మహిళలను చాలా గౌరవంగా సన్మానించడం వారికి ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మ కుమారిస్ చేస్తున్న సేవలు అద్భుతమని గ్రామీణ మహిళలు అభినందనలు తెలియచేశారు

Visakhapatnam Pride: Aditya Students Selected for IIMs

Image
 📰 PRESS NOTE Students of Aditya Business School Achieve MBA Admissions in IIMs Visakhapatnam: Aditya Business School achieved another milestone as two of its students secured MBA admissions in prestigious Indian Institutes of Management (IIMs), bringing laurels to the institution. Mr. Kuda Varshit earned admissions in five IIMs, while Ms. Pitchika Abhinaya secured admissions in two IIMs, showcasing the academic strength and competitive excellence of the students. The management expressed happiness over the achievement and stated that the accomplishment reflects the institution’s commitment towards academic excellence, skill development, aptitude training, communication enhancement, and career-oriented preparation. Chairman Dr. N. Sesha Reddy, Secretary Dr. N. Suguna Reddy, Academic Director Dr. B.E.V.L. Naidu, North Andhra Regional Manager P. Ramakrishna Reddy, and Principal M. Ch. Kishore Babu congratulated the students and appreciated the efforts of the faculty members in guidi...

మదర్స్ డే శుభ సందర్భంగా మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్

Image
మదర్స్ డే శుభ  సందర్భంగా మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్ తే.09.05.2026 ది.శనివారం ఉదయం 10 గంటలకు బసినేని పల్లి గ్రామం, సీతారాంపురం మండలం నెల్లూరు జిల్లా లో ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలకు *మదర్స్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య (బొబ్బిలి సెంటర్ ఇన్చార్జి) గారు మహిళలకు సగౌరవంగా శాలువాలతో సన్మానం చేసి వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ , గ్రామ అభివృద్ధి కోసం *ఉపాధి హామీ* పనులు చేఇస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ B. సుబ్బా రెడ్డి గారు సంతోషం వ్యక్త పరుస్తూ ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలను చాలా గౌరవంగా సన్మానించడం వారికి ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మ కుమారిస్ చేస్తున్న సేవలు అద్భుతమని అభినందనలు తెలియచేశారు.

నిద్రమత్తులో బైక్ ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు

Image
 *నిద్రమత్తులో బైక్ ప్రమాదం  వ్యక్తికి తీవ్ర గాయాలు* చిలకలూరిపేట: జాతీయ రహదారిపై నిద్రమత్తులో బైక్ నడుపుతూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం - తిమ్మాపురం మధ్య చోటుచేసుకుంది. విజయవాడ భవానీపురానికి చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు (49) మార్కాపురం నుండి విజయవాడకు బైక్‌పై వెళ్తుండగా, నిద్రమత్తు కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ సిబ్బంది (ఈఎంటి వై. శోభన్ బాబు, పైలట్ టి. శివనాగం ఆంజనేయులు) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ ప్రయాణం, సరైన నిద్ర లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం క్షణాల్లో బూడిదైన టీ దుకాణం

Image
 చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం క్షణాల్లో బూడిదైన టీ దుకాణం 52 ఎకరాలు టీడ్కో హౌస్ నందు పల్నాడు జిల్లా చిలకలూరిపేట:  పట్టణంలోని 52 ఎకరాల ప్రాంతంలో ఉన్న ఒక టీ స్టాల్లో ఆదివారం ఊహించని విధంగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపారం సాగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు షాపు అంతటా వ్యాపించి చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  *సకాలంలో స్పందించిన స్థానికులు*  మంటలు వేగంగా పక్కన ఉన్న నివాసాలు, దుకాణాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మరియు యువకులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. సకాలంలో స్థానికులు చేసిన సాహసోపేతమైన ప్రయత్నాల వల్లే పెను ప్రమాదం తప్పింది.  *బూడిదైన దుకాణం.. తప్పిన ప్రాణనష్టం*  మంటల ధాటికి టీ స్టాల్ పూర్తిగా దగ్ధమైంది. లోపల ఉన్న ఫర్నిచర్, సరుకులు, ఇతర వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. దీనితో చిరు వ్యాపారికి భారీ...

రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ప్రారంభోత్సవం

Image
 విజయవాడ పటమట లో నిర్మలా కాన్వెంట్ ఎదురుగా రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ప్రారంభోత్సవం న్యూస్ 9 ఛానల్: విజయవాడ నిర్మల కాన్వెంట్ రోడ్, నిర్మలా హై స్కూల్ ఎదురుగా రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ను ప్రారంభించిన మెదడు మరియు క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్, డాక్టర్ రాజేశ్వరి దగ్గుమాటి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్,న్యూరోసోనాలజిస్ట్. ఈ సందర్భంగా డాక్టర్స్ రాజేశ్వరి దగ్గు మాటి, శ్రావణ్ కుమార్ బోడేపూడి మాట్లాడుతూ స్ట్రోక్ రాకుండా మనం గుండెను ఎలా కాపాడుకోవాలి, అది రాకుండా నివారణ మార్గాలు తెలుసుకోవాలి, స్ట్రోక్ అనేది మనం అతి త్వరగా రియాక్ట్ అవ్వాల్సిన జబ్బు అని,గత పది సంవత్సరాలుగా న్యూరాలజీ సర్వీస్ అందిస్తున్నానని, ప్రస్తుతం న్యూరాలజీ క్లినిక్ ప్రారంభించామని, మా దగ్గర పక్షవాతం, మూర్ఛవ్యాధి,తలనొప్పి, కళ్ళు తిరగడం,వణుకుడు,మతిమరుపు జబ్బులు ,మెదడు వ్యాపు వ్యాధి, న్యూరో వాస్కులర్ సమస్యలు, మల్టిపుల్ సర్వీసెస్,కంటి నరము జబ్బులు, వెన్నుపాము సమస్యలు, వెన్నుపూస అరుగుదల, న్యూరోపతిస్ మొదలుగు వాటికి మా దగ్గర చికిత...