ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో రూ 2 కోట్లతో జీవకళ ఉట్టిపడే విధంగా కూడళ్ల సుందరీకరణ పనులు..
*సర్కిళ్ల సుందరీకరణతో రాయచోటి పట్టణానికి పెరిగిన మరింత శోభ...*
*ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో రూ 2 కోట్లతో జీవకళ ఉట్టిపడే విధంగా కూడళ్ల సుందరీకరణ పనులు...*
*పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమీక్ష...*
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కూడళ్ల సుందరీకరణ పనులు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో ముగింపు దశకు చేరుకున్నాయి.రాయచోటి పట్టణ సుందరీకరణకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ 2 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా బంగ్లా, మాసాపేట- వేంపల్లె క్రాస్ రోడ్,
చిత్తూరు రహదారి మార్గంలోని సర్కిల్, గుణ్ణికుంట్ల రింగ్ రోడ్డు సర్కిల్ లలో సుందరీ కరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.దీంతో పట్టణ శోభ మరింత పెరిగింది. పచ్చదనం,విద్యుత్ కాంతులతో కూడళ్లురూపుదిద్దుకోనున్నాయి.రూ 1.15 కోట్ల నిధులుతో ఎస్ ఎన్ కాలనీలో టవర్ క్లాక్ నిర్మాణ పనులను త్వరలో మొదలు పెట్టనున్నారు. అలాగే షాదీ ఖానా సమీపంలోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద సుందరీ కరణ పనులును త్వరితగతిన ప్రారంభించనున్నారు. పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ నుంచి ఎస్ ఆర్ సర్కిల్ వరకు, ఠాణా నుంచి చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వరకు, మదనపల్లె రహదారి మార్గంలో శివాలయం నుంచి రింగ్ రోడ్డు వరకు సుందరంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఠాణా నుంచి సుండుపల్లె రహదారి మార్గంలోని ఐసిడిఎస్ కార్యాలయం వరకు బటర్ ప్లై స్టీట్ లైట్ల ను ఏర్పాటు చేశారు.త్వరలోనే స్ట్రీట్ లైట్లు వెలగనున్నాయి. కూడళ్లపనుల పురోగతిపై అధికారులతో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.పట్టణ అభివృద్ధిలో భాగంగా నాలుగేళ్ళలో గుణ్ణికుంట్ల రహదారి విస్తరణ, అందుకు తగ్గట్లుగా స్ట్రీట్ లైట్లు,ఠాణా నుంచి సుండుపల్లె రహదారి మార్గంలోని రింగ్ రోడ్డు వరకు నాలుగు వరుసల రహదారి , చెక్ పోస్ట్ నుంచి మదనపల్లె రహదారి మార్గంలోని రింగ్ రోడ్డు వరకు సుందరమైన రహదారి విస్తరణలతో పట్టణానికి మరింత నూతన శోభ వచ్చింది. మాసాపేట సర్కిల్ నుంచి రింగ్ రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులను త్వరలో పూర్తి చేస్తామని, రాయచోటి రింగ్ రోడ్డును నాలుగు వరుసలు చేయడం పనులు కొలిక్కి వస్తున్నాయని, ఠాణా వద్ద నేషనల్ హైవే పెండింగ్ పనులు , బ్యాలెన్స్ డ్రైన్ పనులు త్వరలో పూర్తవుతాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు
Comments
Post a Comment