బ్లాక్ మార్కెట్ అరికట్టాలి – డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగించకుండా చర్యలు
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి.
వినియోగదారులను ఇబ్బంది పెట్టవద్దు – తాసిల్దార్‌కు విజ్ఞప్తి
బ్లాక్ మార్కెట్ అరికట్టాలి – డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి
మురికిపూడి ప్రసాద్
కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధ
పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా, ధరలపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు చిలకలూరిపేట తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ కు శుక్రవారం వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆలస్యం, అధిక ధరలకు విక్రయాలు, బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగించడం వల్ల సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. కాబట్టి డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్‌గా ఉపయోగించకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎల్పీజీ సిలిండర్ల సరఫరా వ్యవస్థలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని,
గ్యాస్ బుక్ అవ్వక వినియోగదారు లు ఇబ్బంది పడుతున్నారని గ్యాస్ ఏజెన్సీలు
సమస్య పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించే దిశగా అధికారులు స్పందించాలని కోరారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్, విక్రమ్, రవి నాయక్, గాలయ్య, పుష్పవల్లి
తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment