Posts

Showing posts from July, 2026

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి..

Image
 *కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ డిమాండ్*  *నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి ఛార్జ్ ను ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తా బంద్ లో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో (ఏ ఐ ఎస్ ఏ) సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ దగ్గర  వామపక్ష విద్యార్థి సంఘాల  నిరసన విజయవంతం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్

Image
 అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని దేవపట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 24-7-2026న మెగా పేరెంట్స్ మీటింగ్ గణనీయంగా జరుపుకోవడం జరిగినది.  ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా పనిచేస్తుందని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ సునీత మిగతా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ  ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా పనిచేస్తున్నామని  తెలియజేశారు సరికొత్త ఆలోచనలతో విద్య వ్యవస్థలో  అధునాతమైన మార్పులు  తీసుకొచ్చే విధంగా దానిలో భాగంగానే గత సంవత్సరంలో పదో తరగతి పరీక్ష లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అద్భుతంగా రాణించారాణి తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అందించే దిశగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా చేయాలన్నదే మా ధ్యేయమని ప్రిన్సిపాల్ అన్నారు.అలాగే తల్లికి వందనం పథకం కూడా ప్రతి విద్యార్థికి అందే విధంగా మా పాఠశాల సిబ్బంది పనిచేస్తుందని లీప్ యాప్ ద్వారా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ను యాప్ లోనే తెలుసుకోవచ్చని  ఆమె తెలిపారు. మెగా పేరెంట్స్ మీటిం...

మురికిపూడి ప్రసాద్ సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ

Image
 మురికిపూడి ప్రసాద్ సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాట్సాప్‌లో బ్లూ టిక్ ఆఫ్ చేసి, ఫోన్ ఎత్తకపోవడం జవాబుదారీతనం లోపానికే నిదర్శనం నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై 1902, అత్యవసర సమస్యలైతే 1100 ద్వారా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయాలి చిలకలూరిపేట............ రాష్ట్రంలో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉందని సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, పలువురు అధికారులు వాట్సాప్‌లో రీడ్ రిసీట్స్ (బ్లూ టిక్)ను ఆఫ్ చేసి, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో ప్రజలు పంపిన సందేశాలను అధికారులు చదివారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఫోన్‌కు స్పందించకపోవడం, వాట్సాప్ సందేశాలను పట్టించుకోకపోవడంతో ప్రజలు తప్పనిసరిగా అధికారులను నేరుగా కల...

వినియోగదారుల హక్కుల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినియోగదారుల సంఘం నాయకులు

Image
వినియోగదారుల హక్కుల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినియోగదారుల సంఘం నాయకులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి – *మురికిపూడి ప్రసాద్, సీఆర్పీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు*   *చిలకలూరిపేట* ................. వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీఆర్పీఎఫ్ (కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం) పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం చిలకలూరిపేట పట్టణంలో నరసరావుపేట సెంటర్, చోత్ర సెంటర్ కృష్ణ మహల్ సెంటర్లో సీనియర్ సిటిజన్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు, గ్రామీణ ప్రాంత నాయకులకు వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత లేని వస్తువులు విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, లోపభూయిష్ట సేవలు అందించడం, ఆన్‌లైన్ మోసాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు మౌనంగా ఉండకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు...

ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే

Image
 విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకె క్విజ్ పోటీలు.  ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే   సుండుపల్లి. సంబేపల్లి. విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్విజ్ పోటీలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ వై పద్మావతి తెలిపారు. బుధవారం దేవపట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు వరల్డ్  యూత్  స్కిల్ డే ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్. ఎస్సే రైటింగ్. క్విజ్. వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరినప్పుడే ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు మంచి పేరు లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి కష్టపడి చదివి ఎంతోమంది మేధావులుగా గుర్తింపు పడ్డారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. విద్యాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని  వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చ...

జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు

Image
 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో  దాసరివీధి నుంచి కోటవీధి వరకు జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు జరిగింది దీనికి యవన్మంది భక్తులు పాల్గొని  జగన్నాధ రథాన్ని తీసుకురావడం జరిగింది

మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్...

Image
 న్యూస్9: నరసరావుపేట  మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్... ¡¡ వృధాగా మంచినీరు..... శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల మెయిన్ గేట్ సమీపంలో లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా  జలమయం అయింది. కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:

Image
మురికిపూడి ప్రసాద్  సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ  రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:  మురికిపూడి ప్రసాద్  సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  ************ విజయవాడ........ పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకంలో నిబంధనలు పాటించలేదని, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నియామకాలు జరిగాయని సీఆర్పీఎఫ్‌ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ ఆరోపించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల (Consumer Voluntary Organisations) ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం. 8 ప్రకారం వినియోగదారుల వ్యవహారాలతో సంబంధం లేని వ్యక్తులను కొన్ని జిల్లాల కమిటీలో నియమించడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.ఈ నియామకాల ద్వారా రాజకీయంగా అవకాశాలు లేని వ్యక్తులకు పదవులు కల్పిం...

ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు?

Image
 ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు? ఇల్లు, స్థలం లేదా ఇతర ఆస్తి ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ అమ్మినప్పుడు కొత్త యజమాని పేరు నమోదు చేయడానికి కేవలం నామమాత్రపు ఫీజు తీసుకుంటే సరిపోతుంది ..కానీ ప్రస్తుతం భారతదేశంలో ప్రతి యాజమాన్య మార్పుజరిగినప్పుడు పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు ? ఒకే ప్రాపర్టీ మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎందుకు ? ఒకే ప్రాపర్టీ అది ల్యాండ్ లేదా ఫ్లాట్ లేదా కారు అనుకుందాం . ఆ ప్రాపర్టీ మొదటిసారి కొన్నప్పుడు చట్టబద్ధత కోసం  ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. అదే ఆస్తి పదేళ్లలో మూడు లేదా నాలుగు సార్లు చేతులు మారితే ప్రతి సారి లక్షల రూపాయల ఫీజులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వాల వాదన ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. కొత్త కొనుగోలుదారుడి హక్కులను చట్టబద్ధంగా నమోదు చేయడం, భవిష్యత్తులో వివాదాలు రాకుండా రికార్డులు నిర్వహించడం, ఆస్తి లావాదేవీలకు చట్టపరమైన రక్షణ కల్పించడం ఇందులో భాగం అని చెబుతున్నారు .. కానీ అందుకు లిమిటెడ్ చార్జెస్ వస...

డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం

Image
 డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం చీరాల: డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన శ్రీ బొమ్మ మురళీకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. వెంకటరత్నం గారు, బాపట్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఐ. ధనలక్ష్మి గారు, నెంబర్-1 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.వి. సుబ్బారావు గారు, చీరాల నెంబర్-2 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. మల్లికార్జునరావు గారు, చిలకలూరిపేట సెక్షన్-1 ఏఈఈ శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి గారు, అంజిబాబు గారు, తెనాలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె.వి.ఎల్. ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే చీరాల, రేపల్లె ప్రాంతాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డ్రైనేజీ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై బొమ్మ మురళీకృష్ణ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సేవా కాలంలో ఆయన అందించ...