Skip to main content

Posts

Showing posts from April, 2025

ప్రైవేటు పాఠశాలల అనుమతులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేయాలని విద్యార్థి తల్లిదండ్రులం డిమాండ్

 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1982**, **రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) యాక్ట్, 2009**, **ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్, 2012 & 2017**, **నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) 1997**, మరియు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు  G.O.Ms.No.91  నిబంధనల ప్రకారం లేవు.. వివిధ ప్రభుత్వ  శాఖల నుండి లోపాయి కారితనంగా అనుమతులు తీసుకున్నారు.. జిల్లా స్థాయి ఉన్నత అధికారులు  వెంటనే స్పందించి  మా పిల్లల భద్రత కోసం జిల్లా నగరం లోని అన్ని ప్రైవేటు పాఠశాలల అనుమతులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేయాలని విద్యార్థి తల్లిదండ్రులం డిమాండ్ చేస్తున్నాం  జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అనుమతులకు విరుద్ధంగా ఉన్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డిమాండ్ చేస్తుంది  1)**అనుమతులు మరియు ధృవపత్రాలు**:    - కొత్త పాఠశాల అనుమతులు లేదా అప్‌గ్రేడ్ కోసం,     - **మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ** నుండీ NOC మరియు ట్రాఫిక్ పోలీసు ...అగ్నిమాపక ....శాఖ రవాణా శాఖ నుండి భద్రతా ఆమోదం ప...

10 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల ప్రభుత్వం

 AP     *మార్కాపురం* 10 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల  ప్రభుత్వం .. రోడ్డున పడుతున్న విద్యార్థులు ! విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ..  మార్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదనే నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ .. దీంతో పరీక్ష రాయలేకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు....

బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.

 చిలకలూరిపేటలోని పురపాలక సంఘంలో బుధవారం ఛైర్మన్ షేక్. రఫానీ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.  ముందుగా ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఏజెండాగా 37 అంశాలను పొందుపరిచారు. వైస్ ఛైర్మన్లు, అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, కమిషనర్ శ్రీహరి బాబు, డీఈ రహీమ్, ఆరో సుబ్బారావు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన: డి.ఎస్.పి కె నాగేశ్వరరావు.*

 *నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన: డి.ఎస్.పి కె నాగేశ్వరరావు.* నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన నరసరావుపేట పట్టణ డిఎస్పి కె నాగేశ్వరరావు. స్థానిక పల్నాడు బస్టాండ్ వద్ద గల బైపాస్ రోడ్డు లోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రాన్ని నరసరావుపేట పట్టణ డిఎస్పి కే నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ చలివేంద్రం అటు ఇరు పోలిస్టేషనులకు వచ్చు వారికి సమీప బస్టాండ్ ప్రయాణికులకు ఆ ఏరియాలో ఉన్న విద్యార్థులకు వాహనదారులకు ఈ చలివేంద్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఎండలకు విపరీతమైన తాపం దాహం తీరే విధంగా ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని భావించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరుగడ్డ అంబేద్కర్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మాల మహానాడు, గ్రామాల ప్రజలు , బాటసారులు, విద్యార్థులు, పాల్గొని హర్షంవ్యక్తం చేయడం జరిగింది.

ప్రతి ఫిర్యాదుదారుని పట్ల సహానుభూతి ప్రదర్శించాలి--

 కృష్ణాజిల్లా పోలీస్  *ప్రతి ఫిర్యాదుదారుని పట్ల సహానుభూతి ప్రదర్శించాలి-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,* మీకోసం కార్యక్రమం లో వారి సమస్యను గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చే  ఫిర్యాదు దారుని పట్ల ప్రతి పోలీస్ అధికారి సహానుభూతి ప్రదర్శిస్తూ, ఆ ఫిర్యాదును ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచిస్తే ప్రతి ఫిర్యాదారునికి న్యాయం అందించగలమని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్., గారు అన్నారు.  ▪️ఈరోజు స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదుదారుల వద్ద నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి, వారి యొక్క ప్రతి సమస్యను విని, ఆ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ▪️వయసు మళ్ళిన వృద్ధులకు, నడవలేని స్థితిలో ఉన్నవారికి సహాయకారిగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ▪️మీకోసం ద్వారా వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి పరిష్కారం అందించే దిశగా ప్రతి పోలీసు అధికారి కృషి చేయాలని తెలిపారు ఈరోజు మీకోసం కార్యక్రమానికి 32 ఫ...

పటమట గంగానమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్*

 *Press Note from Devineni Avinash : 27-04-2025* *పటమట గంగానమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్* విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్,పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద  నిర్వహించిన గంగానమ్మ జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అవినాష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేసారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి అమ్మవారి జాతరలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, ప్రజలు ఎల్లవేళలా  సుఖసంతోషాలతో ఉండలని  ప్రార్థిస్తున్న అని అన్నారు.ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరి పై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,జిల్లా గ్రీవెన్స్ సెల్ అద్యక్షులు శెటికం దుర్గా ప్రసాద్,మండల ప్రెసిడెంట్ గద్దె కళ్యాణ్ మరియు డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

స‌మాజ‌హితం కోసం జ‌ర్న‌లిస్టుల కృషి అభినందనీయం : మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి శ్రీ‌హ‌రిబాబు

 *స‌మాజ‌హితం కోసం జ‌ర్న‌లిస్టుల కృషి అభినందనీయం : మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి శ్రీ‌హ‌రిబాబు* *ఏపీయూడ‌బ్ల్యూజే అనుబంధప్రెస్‌క్ల‌బ్  చిల‌క‌లూరిపేట ఆధ్వ‌ర్యంలో*  *పారిశుధ్య కార్మికుల‌కు ల‌స్సీ, మ‌జ్జిగ పంపిణీ* *రానున్న రోజుల్లో సేవా కార్య‌క్ర‌మాలు విస్తృతం చేస్తామ‌న్న జ‌ర్న‌లిస్టు సంఘ నాయ‌కులు*  చిల‌క‌లూరిపేట‌:పేద ప్రజలకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంద‌ని, వృత్తిప‌రంగా ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొంటూ జ‌ర్న‌లిస్టులు సేవా కార్య‌క్ర‌మాలుచేప‌ట్ట‌డంఅభినంద‌నీయ‌మ‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి  శ్రీ‌హ‌రిబాబు చెప్పారు. ఏపీయూడ‌బ్ల్యూజే అనుబంధ  ప్రెస్‌క్ల‌బ్ చిల‌క‌లూరిపేట ఆధ్వ‌ర్యంలో పారిశుధ్య కార్మికుల‌కు మ‌జ్జిగ‌, ల‌స్సీ ని ఒక‌టో డివిజ‌న్‌లో క‌మిష‌న‌ర్ చేతుల అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ  జర్నలిస్టులు ప్రజల సమస్యల్ని వెలికి తీసే బాధ్యత నిర్వహించడమే కాకుండా, సమాజ సంక్షేమం కోసం కూడా ముందడుగు వేస్తుండటం అభినందనీయ మ‌న్నారు. పారిశుధ్య కార్మికులు ప‌ట్ట‌ణాన్ని  పరిశుభ్రంగా ఉంచడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వేస‌విల...

రెండు ఆటోలు ఢీ.... నలుగురు కి తీవ్ర గాయాలు

 *రెండు ఆటోలు ఢీ.... నలుగురు కి తీవ్ర గాయాలు*  చిలకలూరిపేట న్యూస్9 చిలకలూరిపేట -నరసరావుపేట రాష్ట్ర రహదారి పై రోడ్ ప్రమాదం జరిగింది.ఎదురుదుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. పట్టణం లోని గుండయ్య తోట కు చెందిన వారు ఆదివారం నెమలిపూరి వెళ్లి తిరిగి వస్తున్నా సమయం లో నరసరావుపేట రోడ్ భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురు గా వస్తున్న ఆటో వీరి ఆటోను ఢీ కొంది.ఈ ప్రమాదం లో రెండు ఆటోలు ముందు భాగం పూర్తి గా ద్వాంస మైంది.ఘటన స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీస్ లు గాయపడిన వారిని ఆసుపత్రి కి తరలించారు.ప్రాందానికి కారణమైన ఆటో డ్రైవర్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రమాదం జరగడం తో ట్రాఫిక్ కొంతమేరానిలిచిపోయింది.పోలీస్ లు ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహన దారులకు ఇబ్బందులు లేకుండ చర్యలు తీసుకున్నారు.

బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు

 26-04-2025  బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులుయస్. వి. రమణ గౌడ్  స్వాతంత్రము వచ్చిన తరువాత 1947 నుండి 1950లో రాజ్యాంగాన్ని అడాప్ట్  చేసుకున్న తర్వాత జనరల్ ఎలక్షన్ 1951 లో జరిగినవి ఈ ఎలక్షన్లో రాష్ట్రాలు మరియు దేశంలోని మొత్తము ఎన్నిక ఎలక్షన్స్ ఒకేసారి జరిగినాయి అదే విధంగా 1957, 1962 మరియు 1967 4 సార్లు భారతదేశం మొత్తము ఒకేసారి ఎలక్షన్ జరిగింది, కానీ ఈ దేశంలో మెల్లమెల్లగా స్వార్థం పెరిగిపోయి వారి ప్రయోజనాలే ముఖ్యమైనవి దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించుకొని రాజ్యాంగానికి తూట్లు పొడిచడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అయితే ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది వార్డు నెంబర్ తో మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీతో మొదలుపెట్టి ఎంపీపీ వరకు జడ్పిటిసి తో మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్ తో మొదలుపెట్టి చైర్మన్ వరకు ఎమ్మెల్యేకు ఎంపీలకు 1000కోట్ల ఆ స్వామిపరులకు సామాన్య ప్రజలకు ఒకే ఓటు హక్కును కల్పించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయినా వార్డ్ మెంబర్ అయినా ప్రజలు ఆశీర్వదించిత...

పహల్గం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని

*పహల్గం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ విజయవాడ లోని కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ) మిల్క్ ఫ్యాక్టరీలో మానవహారం  *ఈ మానవహారంలో పాల్గొని ఉగ్రవాదులు దాడిని ఖండించిన ఎంపీ కేశినేని శివనాథ్  *కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు *పహల్గం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందన్న ఎంపీ కేశినేని శివనాథ్  *ఉగ్రవాదులు దాడుల్లో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయడంతోపాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించిన ఎంపీ కేశినేని శివనాథ్ *ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది * దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఒకటై  ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించటానికి ఉగ్రవాదమూకలు ఈ దాడికి పాల్పడ్డారు  * దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు  * దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక  పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యకు పాల్పడ్డార...

కాశ్మీర్ ఉగ్రవాదులు ను నిరసిస్తూ విజయవాడ నగరంలో

 భారతీయ జనతాపార్టీ  ఆంధ్రప్రదేశ్  విజయవాడ... కాశ్మీర్ ఉగ్రవాదులు ను నిరసిస్తూ విజయవాడ నగరంలో ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో బిజెపి ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు  కాశ్మీర్ లో భారతీయులపై జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాండిల్ ర్యాలీ  పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్   *మంత్రి సత్య కుమార్ యాదవ్*  పాయింట్స్  ప్రపంచ దేశాలు అన్ని కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తు భారతదేశానికి అండగా నిలిచాయి   కొంతమంది ఉగ్రవాదులు పిరికిపంద చర్యగా పాల్పడి కొంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు   దేశనాయకత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేదు  గతంలో లాగా ఏం చేస్తే సాగుతుందనే భ్రమలో  ఉన్నారు  ఎవరైతే ఉగ్రవాద దాడిలో చనిపోయిన 26 మందికి నివాళులర్పిస్తున్నాం   కచ్చితంగా ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెతికి వెతికి శిక్ష పడేలా చేస్తాం   అలాగే ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్ర ప్రదేశ్  విశాఖకు చెందిన చంద్రమౌళి  కావలికి చెందిన మధుసూదన్ ఈ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు...

పహల్గామ్ ఉగ్రదాడి పిరికి చర్య...* *ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి...*

  * పహల్గామ్ ఉగ్రదాడి పిరికి చర్య...* *ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి...* విశాలాంధ్ర సుండుపల్లె మండల కేంద్రంలో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు మంగళవారం ఉగ్రవాదులు దాడిలో అమాయకులైన ప్రజలు మృతి చెందిన దానిపై కూటమి నాయకులు బుధవారం కొవ్వూర్తులతో ర్యాలీ మానవహారం నిర్వహించారు. మారణ హోమం ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోందని ముఖ్యంగా మృతులు, బాధితులను చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఉన్న గుండెలన్నీ శోకిస్తున్నాయి.కూటమి నాయకులు ఆధ్వర్యంలో  ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారు మౌనం పాటించారు.క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో   రాజంపేట భాజపా అసెంబ్లీ కన్వీనర్ రామ జగదీష్, సయ్యద్ అహ్మద్, స్వామి.జనసేన నాయకులు రెడ్డిరాణి. రాజా. జగిలి ఓబులేసు. రెడ్డయ్య రాజు. బిజెపి మండల అధ్యక్షుడు రమణ గౌడ్.నాగరాజు, సుబ్బరాజు,సుబ్బరాము అంజి. ప్రసాద్. నాగేశ్వర. సురేష్.తదితరులు పాల్గొన్నారు .

"World Earth Day"

 Respected Sir, Today(22-04-2025) the Indian Red  Cross Society, Srikakulam District Branch Team Involved, @.Participated in Plantation Programme at NTR Municipal High School,Srikakulam on eve of " World Earth Day" with support of Junior Red Cross Volunteers and School Teaching & Non Teaching Staff.  @.Conducted "World Earth Day" with support from Youth Red Cross Volunteers at Agricultural Research College,NAIRA, Village,Srikakulam. .Conducted Rally Programme on the  Awareness of the Soil Management on the eve of "World Earth Day" with support from Youth Red Cross Volunteers at Agricultural Research College,at Naira Village,Srikakulam.  @.met to Dr.M. BHARATHA LAKSHMI, ASSOCIATE DEAN AGRICULTURAL COLLEGE, NAIRA for  Blood Donation Motivation Camp.The Camp dated fixed on 02-05-2025 by the Senior Management of the College. @ Conducted "Senior Professional First Aid Training" Programme to employees of Divi's Laboratories,Chippada (Village) B...

అవినీతి అధికారులపై ఫిర్యాదుకు రాష్ట్ర లోకాయుక్త సంస్థ.🇮🇳

 *అవినీతి అధికారులపై ఫిర్యాదుకు రాష్ట్ర లోకాయుక్త సంస్థ.🇮🇳* ప్రభుత్వ అధికారి,ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యం,అవినీతి, చట్ట విరుద్ధంగా చేయకూడని పనులు చేయడం,చేయాల్సిన విధులు బాధ్యతలు నిర్వహించక పోవడం.  మొదలగు వాటిపై ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి వున్న సంస్థ రాష్ట్ర లోకాయుక్త సంస్థ. 🇮🇳 మేలుకో వినియోగదారుడా,🙏 రాష్ట్ర ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి🇮🇳 జైహింద్🇮🇳 ఫిర్యాదుకు రుసుము:  Rs.150/- రుసుము పోస్టల్ MO లేదా బ్యాంక్ DD చెల్లించి ఫిర్యాదు తో పాటు జత చేసి పంపాలి.  ఫిర్యాదులు పంప వలసిన చిరునామా:🙏 The Institution of Lokayukta, DNO: 96/3-72-124-1, Santhosh Nagar. Main Road,Behind: Mahendra Showroom,  Kurnool-518006.  Kurnool District, Andhra Pradesh.🙏 మండల్ సమాచార కేంద్రం. MCIC. ఇంచార్జ్ ఎం నర్సింగ్ రావు. బొబ్బిలి, 🇮🇳CRPFI. జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ డి, సురేష్ PR, 9133366449🙏 సత్యమేవ జయతే🙏
 జూనియర్‌ కళాశాలల ఎంపిక ఎలా? పదవ తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే... ప్రైవేటు విద్యా వ్యాపారుల సౌలభ్యం కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభించింది... (తీసుకునేది ప్రభుత్వ జీతాలు... పాటు పాడేది విద్యా వ్యాపారుల కోసం)  సరే... రెండు రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.. -జూనియర్‌ కళాశాలలను గుర్తించాలంటే ఎటువంటి ప్రామాణిక కొలమానాలు లేవు. ఉన్న అమలు చేయని అధికారులు ఎందుకు లేవని అడగని తలిదండ్రులు  -ఈ కళాశాల  పరిధిలోని వసతి గృహాలపై వివిధ ప్రభుత్వ శాఖల ఇంటర్మీడియట్ బోర్డ్ పర్యవేక్షణ అసలే లేదు.  -జేఈఈ, నీట్, ఎంసెట్‌ పేరు చెప్పి ఎంత ఫీజు వసూలు చేస్తున్నా నియంత్రించే యంత్రాంగమూ  లేదు.  - జేఈఈ, నీట్, ఎంసెట్‌ పేరు తో కళాశాల సమయం లో కోచింగ్ సెంటర్లు గా కళాశాల లను నడుపుతున్న ఏ అధికారులు ఏ తలిదండ్రులు ప్రశ్నించరు.  - కళాశాలలో చేరిన వెంటనే బండి నిండా మెటీరియల్ ఇస్తే చాలు తల్లిదండ్రులకు ఆనందం....  -  పిల్లవాడు రెండు సంవత్సరాల అయ్యే లోపు  పుస్తకం సీలు గాని మడత గాని నలగదు విప్పరు... మిఠాయి కి వేయాల్సిందే.. కళాశాలలో బోర్డు అనుమతి ...

గ్రానైట్ క్వారీలలో జరిగిన గ్రానైట్ లీజులలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని

 పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని సర్వే నెంబర్ 324/P లో గల సూర్య తేజ ఎక్స్పోర్ట్స్, సిహెచ్ చెంచుకుమారి గ్రానైట్ క్వారీలలో జరిగిన గ్రానైట్  లీజులలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నరసరావుపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జెవి సంతోషులకు చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నార్నే హనుమంతరావు, చింతల సింగయ్య , బొప్పూడి గ్రామ ప్రజలు అర్జీని ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ తాము పేర్కొన్న గ్రానైట్ క్వారీలలో జరిగిన అక్రమాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. గత కొంతకాలంగా ఇదే విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను తెలియజేయడం జరిగిందని వారన్నారు. అయినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించలేదని వారు తెలిపారు. మొదటగా నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేసి అనంతరం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన...

కంచన రెడ్డిశేఖర్ NRI టీడీపీ గారి ఆధ్వర్యములో కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో

 ✍️తేదీ 20-4-2025సుండుపల్లి మండలం ముడుం పాడు గ్రామం కందల వాండ్ల పల్లి వాసి కంచన రెడ్డిశేఖర్ NRI టీడీపీ గారి ఆధ్వర్యములో కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీయులు పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు🎂✌️🌺 ఈ కార్య క్రమంలో  పాల్గొన్న తెలుగుదేశం జనసేన నాయకులు ,మనుబోతు సహదేవ,గోవిందు ఆనంద్,సాయి,కుంపటి నాగరాజ,కుంచా నాగేష్,గుగ్గిళ్ల నాగార్జున,బెంగుళూరు బ్రహ్మయ్య ,బలరాం ,మల్లికార్జున,మూర్తి,మధుసూదన్,విశ్వేశ్వర,🌺✌️🎂 #HBDLegendCBN garu #TDP_Kuwait #JaiNaraLokesh garu #ChandrababuNaidu garu

ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల

 All the best... మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల *ప్రభుత్వ పరీక్షల విభాగం ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ* Rc.No.GE-CPRO0RSLT(DPRP)/1/2023-DGE తేదీ: 21.04.2025 *ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల* • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ రామరాజు.వి. ఐ.ఎ.ఎస్., • • అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్ మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నారు  . అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/  వెబ్ సైట్లు, ‘ మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.  వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.  అలానే సంబంధ...

RTE 2009 1వ తరగతి 25% ఉచిత సీట్లు

 RTE 2009 1వ తరగతి 25% ఉచిత సీట్లు | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు @ ఆ విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1)C అమలులో భాగంగా 2025 2026 విద్యా సంవత్సరంలో IB/CBSE/ICSE/State Syllabus చదువుతున్న పాఠశాలల్లో, 1వ తరగతిలో ప్రవేశానికి 28.04.2025 నుండి 15.05.2025 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డారు. @ విద్యార్థుల ఆధార్ ద్వారా, ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్ సైట్ నందు కేటాయింపు జరుగును.  @ ఎంపికైన విద్యార్థుల జాబితా సంబంధిత పాఠశాలల్లో చూడవచ్చు.  @ విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రము/ సంబంధిత పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  @ ఇతర విషయాల కొరకు . టోల్ ఫ్రీ: 18004258599 సంప్రదించండి. @ దరఖాస్తు సమర్పించడానికి కావలసిన డాక్యుమెంట్స్... 1. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కొరకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక/MGNERGS జాబ్ కార్డ్/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు/రెంటల్ అగ్రిమెంట్ కాపీ. 2. పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం.. 3...

ఫీజుల నియంత్రణ క్ చర్యల కు కలెక్టర్ ఆదేశాలు...

 తేదీ 21/4/2025.. ప్రచురణ // ప్రసారార్థం ఫీజుల నియంత్రణ క్ చర్యల కు కలెక్టర్ ఆదేశాలు... -ప్రవైట్ పాఠశాల లలో ఫీజుల నియంత్రణ కు DFRC సమావేశమై 2025-26 విద్యా సంవత్సరం ఫీజుల నిర్ధారణ చేయాలి  -ప్రతి పాఠశాల అకౌంట్ ఆడిట్ మరియు సొసైటీ ట్రస్ట్ ల ఆడిట్ లను ఆర్డీవో స్థాయి జుడిషియల్ అధికారుల ద్వారా చేయించాలి.  -ఫీజుల వివరాలను  పాఠశాల నోటీసు బోర్డుపై విద్యాశాఖ పాఠశాల వెబ్ సైట్ లో ఉంచాలి. -డి ఎఫ్ ఆర్ సి సమావేశం అనంతరం పాఠశాలల ఫీజుల వివరాలను మీడియా ముఖంగా ప్రకటించాలి  -పాఠశాల ఫీజు రసీదులలో విద్యాశాఖ రిజిస్ట్రేషన్ నెంబర్ సొసైటీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాఠశాల కల్పించే సేవల బట్టి ఫీజుల వివరాలను  ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రోజు సోమవారం జరిగిన గ్రీవెన్స్ లోకలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది... వెంటనే స్పందించిన కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటా శ్రీనివ...

కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో. కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

 విజయనగరం జిల్లా. ఎస్ కోట మండలం. కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో. కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.  చనిపోయిన కొబ్బరి మొక్కల స్తానంలో కొత్త మొక్కలు నాటుటకు మరియు వాటిని పునరుద్దరణ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీప్లాంటింగ్ అండ్ రెజ్యూవినేషన్ ఆఫ్ కోకోనట్ గార్డెన్ స్కీంతో మన జిల్లా కొబ్బరి రైతులను కూడా ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి కాండ్రేగుల ప్రసాద్ అన్నారు.  కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో గల కొబ్బరి రైతులతో.కూలీలు  కొరత వల్ల వ్యవసాయాన్ని సకాలంలో చెయ్యలేక ఉద్యాన పంటలు వైపు మళ్ళి, కొబ్బరి సాగు చేస్తుంటే మొవ్వు కోరికే పురుగుల వలన మరియు  బూడిదరంగు తెగుళ్లు వలన  కాపుకొచ్చే మొక్కలు చనిపోతున్నాయని, దానివలన రైతులు నష్టపోతున్నారని అన్నారు.  కావున రైతులకు నష్టపరిహారంతో పాటు చనిపోయిన ముక్కలను తిరిగి నాటుకోనటం కోసం మొక్కకు వెయ్య రూపాయిలు చొప్పున తక్షణ పరిష్కారం గా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  కొబ్బరి రైతులు కే రాము, బీసెట్టి స్వామి నాయుడు, కే రామ వెంకట సత్యనారాయణ, ఎల్లపు...

బుది సంతాని జాతర – భక్తిశ్రద్ధలతో ప్రజా సంబరాలు

 బుది సంతాని జాతర – భక్తిశ్రద్ధలతో ప్రజా సంబరాలు ఒడిషాలోని బెరంపూర్ పట్టణంలో బుది సంతాని అమ్మవారి జాతర ఉత్సాహభరితంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. అమ్మవారిని ప్రసన్నం చేసేందుకు భక్తులు వివిధ వేషాలలో పాల్గొంటూ ఆహ్లాదకరమైన దృశ్యాలను సృష్టించారు. అమ్మవారికి పులి నృత్యం ప్రీతికరమైనదని భావించి, ఖలాసీ వీధికి చెందిన యువకులు ఈ నెల 18న ప్రత్యేకంగా పులి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యంలో న్యూస్ 9 రిపోర్టర్ భారతి  కుమారుడు భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ సందర్భంగా వారు బీజేపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు పొందారు. ప్రజాసేవకు అంకితమైన నేతగా  ఎమ్మెల్యే అనిల్ కుమార్, బాల నర్తకుడికి స్ఫూర్తినిచ్చే మాటలతో మద్ధతు తెలిపారు. అలాగే, న్యూస్ 9 ఏపీ లీగల్ అడ్వైజర్ జయలక్ష్మి కుమార్తె అఖిల కూడా ఈ జాతరలో చురుకుగా పాల్గొని సందడి చేసింది. ఈ విధంగా, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బుది సంతాని జాతర, భక్తి-భావాలతో ప్రజలను ఆకట్టుకుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా

 విజయనగరం జిల్లా, శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వార్తలు... నవ్య ఆంధ్రప్రదేశ్‌కి రథసారధి, నిత్య కృషివంతుడు, నిరంతర శ్రామికుడు, అమరావతి రూపకర్త, తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఆధ్వర్యంలో, శృంగవరపుకోటలోని పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ – “నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకులు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే మన బాధ్యత” అని పేర్కొన్నారు. వేడుకల అనంతరం, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆపిల్ పళ్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "శృంగవరపుకోట నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని అర్ధవంతంగా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలు చేపట్టిన గొంప కృష్ణ గారికి అభినందనలు. ...సన్యాసిరావు News9

నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా

 విజయనగరం జిల్లా. శృంగవరపుకోట నియోజకవర్గం. నవ్య ఆంధ్ర ప్రదేశ్. రథసారథి. నిత్య కృషీవలుడు. నిరంతర శ్రామికుడు. అమరావతి రూపకర్త.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు. నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఆధ్వర్యంలో. చంద్రబాబు నాయుడు పరిష్కరించుకొని కేక్ కటింగ్ చేసి తదనంతరం. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న. ప్రతి ఒక్కరికి ఆపిల్ పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

S Brothers 2వ అతిపెద్ద మెగా షాపింగ్ మాల్ సరికొత్తగా ఇప్పుడు *ఏలూరు రోడ్, విజయవాడలో* ప్రారంభం

 మీ అభిమాన 💖 R S Brothers 2వ అతిపెద్ద మెగా షాపింగ్ మాల్ సరికొత్తగా ఇప్పుడు *ఏలూరు రోడ్, విజయవాడలో* ప్రారంభం కానుంది! 🎉 ఇదే మా ఆహ్వానం! 🎉 మీ కుటుంబంతో కలిసి వచ్చి అద్భుతమైన షాపింగ్ అనుభూతిని పొందండి 🌟 *ప్రముఖ సినీ నటి శ్రీమతి కీర్తి సురేష్ గారి చేతులు మీదుగా  ఏప్రిల్ 18,  గొప్ప ఆరంభం*. 🛍 ట్రెండింగ్ కలెక్షన్లు 🎊 ప్రత్యేక ఆఫర్లు 💫 అద్భుతమైన షాపింగ్ అనుభూత 📍 స్థలం: R S Brothers మెగా షాపింగ్ మాల్,బీసెంట్ రోడ్ క్రాస్,ఏలూరు రోడ్

తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజిపి శ్రీ జివిజి అశోక్ కుమార్ ఐపిఎస్.*

 కృష్ణాజిల్లా పోలీస్  *వార్షిక తనిఖీల్లో భాగంగా బందర్ సబ్ డివిజన్లోని కృత్తివెన్ను, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజిపి శ్రీ జివిజి అశోక్ కుమార్ ఐపిఎస్.* వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు ఏలూరు రేంజ్ ఐ.జి.పి శ్రీ జి.వి.జి.అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని కృత్తివెన్ను, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో తనిఖీ నిర్వహించారు.  ▪️ఈ వార్షిక తనిఖీల్లో ఐజిపి గారితో పాటు కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్., గారు, బందరు డిఎస్పి సిహెచ్ రాజా గారు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ▪️ కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ తనిఖీకి విచ్చేసిన ఐ.జి.పి గారికి పోలీసు అధికారులు మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ▪️మచిలీపట్నం పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడానికి ముందు ఐ.జి.పి గారు, ఎస్పీ గారు, బందరు డిఎస్పి గారితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో గల పింగళి వెంకయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ▪️మొదటగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాలను పరిశీలించి స్టేషన్ చుట్టుపక్కల ఉన్న ప...

అర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్,

విజయవాడ మాజీమంత్రి దేవినేని నెహ్రూ 8వ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, MLC తలశీల రఘురాం,సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఫ్లోర్ లీడర్ సత్యం,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు, దేవినేని అభిమానులు,వైసీపీ నేతలు  *జిల్లా అద్యక్షలు దేవినేని అవినాష్ కామెంట్స్* దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు, నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించాం నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయిన అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు ఐదు సార్లు mla గా,ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారు ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు MLA లు,,మంత్రులుగా ఎదిగారు వైసిపి హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచాం వాల్ నిర్మాణానికి జగన్ గారు చిత్తశుద్ధితో కృషి చేశారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం *ఎమ్మెల్సీ తలశీల రఘురాం కామెంట్స్* విద్యార్థి నాయకుడుగా రాజకీయం...