అభివృద్ధి కూటమి కే సాద్యం*

 *అభివృద్ధి కూటమి కే సాద్యం*



































*సీఎం చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం - ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ* 

 

 కూటమి ప్రభుత్వ సారధ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సోమవారం నాయుడుపేట మండలం లోని చిగురుపాడు లో 1.95 కోట్ల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు, బి టి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే తోపాటు కూటమి పార్టీ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గంలో 251కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. కూటమి పార్టీ నాయకుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు పేరం సెట్టి శ్రీ రామ్ ప్రసాద్,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసి చైర్మన్ శిరసనంబేటీ విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షులు జి విజయ్ కుమార్ నాయుడు, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్,పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ రఫీ, తెలుగుదేశం పార్టీ నాయకులు నెలవల రాజేష్,కట్టా వెంకటరమణారెడ్డి కరీంబాయి చెంచయ్య, పోట్లపూడి రాజేష్, శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు,కాపులూరు చక్రపాణి,పలుకూరు ముత్యాలయ్య,బల్లి ముత్యాలయ్య, దూడల కన్నయ్య,గాలి రాజేష్, చెందేటి సుజాత, తుపాకుల కన్నమ్మ, సర్పంచ్ మస్తానయ్య, బిజెపి నాయకులు ఏవీఎస్ రవీంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి