బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది
*ప్రెస్ నోట్*
బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది
ఓం శాంతి! ప్రజా పితా బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాయం బొబ్బిలి న్యూ జగన్నాధపురం లో గల పరమాత్మ అనుభూతి ధామ్ సేవా కేంద్రం లో CAPF విభాగానికి సంబంధించిన రిటైర్డ్ మరియు ఇన్ సర్వీస్ లో ఉన్న 70 మంది CAPF జవాన్ల తో స్నేహ మిలన్ కార్యక్రమం నిర్వహించారు దేశ రక్షణ కోసం , చేస్తున్న త్యాగం , సేవలను కొనియాడారు. ఎల్లప్పుడూ దేశమంతా CAPF జవాన్ సోదరులకు ఋణపడి ఉంటుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అక్కయ్య కొనియాడారు . ఈ సందర్భంగా విచ్చేసిన CAPF సైనిక సోదరులు అందరికీ శివ పరమాత్మ పరిచయం నిచ్చి , బ్రహ్మా కుమారిస్ సంస్థ చేపడుతున్న 20 విభాగాల ద్వారా ప్రపంచంలో 140 దేశాలలో రకరకాల సేవలను గూర్చి తెలియచేశారు. జవాన్లు సరి హద్దులో శత్రువులపై విజయం సాదిస్తున్నారు. మీ లో ఉండే కామ, క్రోధ,లోభ,మోహ, అహంకారాలనే శత్రువులపై మెడిటేషన్ చేసి ఎలా విజయం సాధించాలో తెలియచేశారు. అనేక జిల్లాలనుండి విచ్చేసిన సైనికులు అంతా ఒకే చోట కలిసి కేక్ కటింగ్, మరియు ఆత్మిక ఆలింగనం తో సామూహిక యోగం తో
అందరూ ఎంతో ఆనందం ను వ్యక్తం చేశారు. కొంత మంది CAPF సైనికులు తమ యొక్క గొప్ప అనుభవాలను అందరితో పంచుకున్నారు. రాజయోగ అనుభూతి ని చేసుకున్న CAPF సైనిక సోదరులు అందరూ ఎంతో హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ కు
సంబంధించిన రిటైర్డ్ మరియు ఇన్ సర్వీస్ లో ఉన్న 70 మంది ఆర్మీ సోదరులకు సన్మాన సత్ కార్యం బొబ్బిలి సేవా కేంద్రం లో ఇన్ ఛార్జ్ గా ఉన్న సోదరి బిక్ రాజేశ్వరి అక్కయ్య ఈశ్వరీయ కానుకను అందచేసారు.
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment