అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

 *అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..           లోక్ సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్..*




ఎందరో మహానుభావుల త్యాగఫలం, ఈ స్వాతంత్ర పుణ్యఫలం. భారతీయులు అందరూ జరుపుకునే 2 పండుగలలో 

1. స్వాతంత్ర దినోత్సవం

2. గణతంత్ర దినోత్సవం 

ఎందరో మహానుభావులు తమ జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టి బ్రిటిష్ వారి బానిసత్వం సంకెళ్ల నుండి మనకు స్వేచ్ఛను కల్పించారు. 

ఈ 78 సంవత్సరాల్లో మనం సాధించిన లక్ష్యాలతో పాటుగా మనం సాధించాల్సిన అంశాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 

రాజ్య వ్యవస్థకు మూలం,, ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం.  ప్రజాస్వామ్యానికి పునాది చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన లేకుండా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన అది సరియైన పరిపాలన కాజాలదు. 

ఈ 79వ స్వాతంత్ర్యం ప్రజల ముందు కొన్ని సవాళ్లు కనబడుతున్నాయి.

1.  కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పద అంశంగా మారిన ధర్మస్థల్. విష సర్పాలను చంపొద్దు అని ప్రచారం చేసే భారతీయ సమాజంలో కనిపించకుండా పోతున్న ఆడపిల్లల గురించి తెలుసుకో లేకపోవడం విచారకం. 

2. స్వాతంత్ర ప్రతిపత్తి కలిగి రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుంది అనే ఆరోపణలు వచ్చే విధంగా చేసుకోవడం, పారదర్శకత లోపించడం దురదృష్టకరం. 

3. ప్రకృతి వైపరీత్యాలు భారతదేశానికి కొత్త ఏమీ కాదు, కానీ ముందస్తు ప్రణాళికలు లేకుండా కాస్తంత వర్షం వస్తే మనం నివాసం ఉండే వీధులు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఏ మేరకు ముంచే ముంచేత్తుతున్నాయో పౌరులుగా మనమందరం ఆలోచించాలి.

4. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా, కనీస మౌలిక సదుపాయాలు కల్పనలో వెనకబడి పోవడానికి కారణమేమిటి?

5. ప్రపంచంలో ఏ దేశంలో లేని వ్యక్తి పూజ ఎందుకు రోజురోజుకీ మన రాష్ట్రాలలో పెరిగిపోతుంది? మన యువత బిగ్బాస్ కంటెస్టెంట్స్, క్రికెటర్స్, సినిమా కథనాయక పాత్రధారుల కోసం అన్నట్లుగా వెర్రి తలలు వేయడంలో ఎంటర్టైన్మెంట్ మీడియా పాత్ర ఎంతుందో ఆలోచించాలి?

79 వ స్వాతంత్ర దినోత్సవ వేళ విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచన చేయాలని కోరుకుంటూ మరొకసారి పౌరులందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

మాదాసు భాను ప్రసాద్, 

అడ్వకేట్ & లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు