నిద్రమత్తులో బైక్ ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు

 *నిద్రమత్తులో బైక్ ప్రమాదం  వ్యక్తికి తీవ్ర గాయాలు*




చిలకలూరిపేట: జాతీయ రహదారిపై నిద్రమత్తులో బైక్ నడుపుతూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం - తిమ్మాపురం మధ్య చోటుచేసుకుంది. విజయవాడ భవానీపురానికి చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు (49) మార్కాపురం నుండి విజయవాడకు బైక్‌పై వెళ్తుండగా, నిద్రమత్తు కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ఆయనకు  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ సిబ్బంది (ఈఎంటి వై. శోభన్ బాబు, పైలట్ టి. శివనాగం ఆంజనేయులు) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ ప్రయాణం, సరైన నిద్ర లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Comments