రాష్ట్రంలో చెత్త పన్ను* *వసూలు చేయవద్దని ఆదేశాలు

 


*రాష్ట్రంలో చెత్త పన్ను* *వసూలు చేయవద్దని ఆదేశాలు*


ఆంధ్ర ప్రదేశ్ :


ఆంధ్ర రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూళ్లు నిలిపి వేయాలన్నారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం చెత్త పై పన్ను చెల్లింపు ను రద్దు చేశారు.


చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసిన

సంగతి తెలిసిందే.