Skip to main content

Posts

Showing posts from May, 2025

వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ తనిఖీపై అవగాహన కార్యక్రమం

 వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్  తనిఖీపై అవగాహన కార్యక్రమం   చిలకలూరిపేట  వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని కేబీ రోడ్లో పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు ఎలా తనిఖీ చేసుకోవాలో ప్రజలకు  తెలియజేసి నాయకులు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువు గురించి నాణ్యత మరియు ధరలను ప్రశ్నించే హక్కు వినియోగదాలకు ఉంటుందని అన్నారు. అదేవిధంగా పెట్రోలు బొంకులలో పెట్రోల్ కొనుగోలు చేసి పోయించుకునేటప్పుడు  మీటర్ రీడింగ్ చూసుకోవటం, పెట్రోల్ నాణ్యతను పరీక్షించుకోవడం,  పెట్రోలు కొలత తనిఖీ చేసుకోవటం, మరియు పెట్రోల్ బంక్ లో ఉండే ఇతర వసతులను తెలుసుకొని ఉపయోగించుకోవటం.. ఏదైనా నష్టపోయామని తెలుసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు , సభ్యులు నందిపాటి రవి, ఏం పుష్పవల్లి , తూబాటి సుభాని తదితరులు పాల్గ...

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపండి! ..

 *గంజాయి  మరియు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపండి! ..లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్..*  తెనాలిలో గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలను తీసుకొని నేరాలు జరగకుండా చూడాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.  గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ అనుచరులు చేసిన దాడిని మాత్రమే డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటే సరిపోదని, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని  అనేక కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని విషయాన్ని గుర్తించి, గంజాయి క్రయవిక్రయాలను జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనా వారు కుటుంబాలలో వృద్ధులైన తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యని చావబాదుతున్న సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న అధిక కేసుల్లోనూ, రోడ్డు ప్రమాదాల్లోనూ మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు స...

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్టమైన చర్యలు తీసుకోండి

 *రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్టమైన చర్యలు తీసుకోండి - రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ.. లోక్ సత్తా పార్టీ, మాదాసు భాను ప్రసాద్*  రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాశారు.   చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది చనిపోయారని, ఇంకా ఎంతోమంది క్షతగాత్రులై జీవితకాలం అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారు.  ఆలోచిస్తే, వీటిలో ఎక్కువ శాతం నివారించదగిన రోడ్డు ప్రమాదాలే.  కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ నష్టం ఎంత మాత్రమూ భర్తీ చేయలేనిదని మరియు ఎంత నష్ట పరిహారం ఇచ్చినా, ఇన్సూరెన్స్ ఇచ్చిననూ కుటుంబంలో ఆలోటు పూడ్చలేనిదిని లేఖలు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు కనీస ప్రమాణాలను పాటించకుండా ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదు అనే విషయం జగమెరిగిన సత్యం.  ఓవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్నా, అవకాశాలను అందిపుచ్చుకోకుండా మూస ధోరణులతో అద్భుతాలు సాధించాలనుకోవడం సరి అయినది కాదన్నారు. పట్టణం...

ఎన్నో నకిలీ స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి... మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్

 పత్రికా ప్రకటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంధ సంస్థల గుర్తింపు గ్రామీణ గిరిజన ప్రాంతాలలో ఏ విధమైన సేవలు ఎవరు చేయవచ్చును అని పటిష్టమైన చట్టాలు రూపొందించకపోవడంతో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వెలిశాయని నకిలీ స్వచ్ఛంద సంస్థలు మహిళలను అమయాకులైన గిరిజనులను పౌరులను మోసం చేస్తున్నాయని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ ప్రసాద్ అన్నారు. చాలా రాష్ట్రాలలో కులాలు మతాల పేరున విద్య వైద్య సంస్థలు వెలిశాయని కానీ నేరాలు జరిగి పత్రికలలో వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కంటితుడుపుగా చర్యలు తీసుకుంటూ చట్టాలను అవహేళన చేస్తున్నాయని అన్నారు సేవా సంస్థల్లో ముఖ్యంగా వినియోగదారుల హక్కులు, పర్యావరణ హక్కులు, మానవ హక్కులు ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోయినా వాహనాలపై కార్యాలయాలపై ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలుగా అమాయకులను మోసం చేస్తున్నాయని శ్యామ ప్రసాద్ ఆరోపించారు. గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛంద సంస్థలు పనితీరు హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించేదని గత దశాబ్ద కాలంగా స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించడం లేదని అన్నారు. మా సంస్థ లక్ష్యాలు, ఆశయాలు, హక్కుల పరిరక్షణ మాత్రమే అని విద్యార్థులలో ...

జూన్ 12 వ తేదీ నుండి పాఠశాల లు ప్రారంభం..

 జూన్ 12 వ తేదీ నుండి పాఠశాల లు ప్రారంభం.. ఆశల పల్లకి విహరించే మన తలిదండ్రులు....?? ఎండమావుల.. సామెతగా ఉంది మన పరిస్థితి.. "డబ్బులు ఊరికినే రావు.. బోడిగుండోడి .. మాట " ప్రభుత్వ vs. ప్రైవేటు పాఠశాలలలో మన పిల్లలను చేర్చాలో నిర్ణయించుకోవలసిన సమయం.... ASER 2024 నివేదిక ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల గురించి కూడా కీలక అంశాలు తెలియజేసింది.  ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల చేరిక, అభ్యసన స్థాయిలపై ఈ నివేదికలో స్పష్టమైన పోలికలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల గురించి ASER 2024 నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలు: ప్రైవేటు పాఠశాలల్లో చేరిక (Enrollment in Private Schools)  * ప్రీ-ప్రైమరీ స్థాయిలో: 2024లో, సుమారు మూడింట ఒక వంతు (37.5%) మంది 5 సంవత్సరాల పిల్లలు ప్రైవేటు పాఠశాలలు లేదా ప్రీ-స్కూల్‌లలో చేరుతున్నారు. ఇది 2018లో 37.3% ఉండగా, కోవిడ్-19 సమయంలో 30.8%కి పడిపోయి, ఇప్పుడు తిరిగి ప్రీ-కోవిడ్ స్థాయిలకు చేరుకుందని నివేదిక పేర్కొంది.  * ప్రాథమిక విద్య (6-14 సంవత్సరాలు): 6-14 సంవత్సరాల వయస్సు గల గ్రామీణ పిల్లలలో, ప్రైవేటు పాఠశాలల్లో చేరిక దాదాపు పదేళ్లకు...

పరగాటి వారి పెళ్లి సందడిలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు

 పరగాటి వారి పెళ్లి సందడిలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, 22.05.2025. పరగాటి వారి పెళ్లి సందడిలో గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పరగాటి సుబ్బారావు గారి కుమారుడు విజయ్ గారి వివాహం సునీత గారితో కొండపల్లిలోని బి కాలనీ ఆడిటోరియంలో గురువారం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు గారు నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా

 చిలకలూరిపేట న్యూస్9:   ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా  చిలకలూరిపేట పట్టణంలోని చీరాల రోడ్ లో పాటిమీద అంకమ్మ చెట్టు సమీపంలో నడి రోడ్డుపై చెట్టు కూలిపోయింది, విద్యుత్ అంతరాయం కారణంగా చీకట్లో అవస్థలు పడుతున్న వాహన చోదకులు కూలిన చెట్టు ను దాటుకుంటూ పోవడం కష్టతరంగా ఉన్నది. అధికారుల త్వరితగతిన నడి రోడ్డుపై కూలిపోయిన చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజల కోరుతున్నారు..

వాటర్ ఫాల్స్ లో సెక్యూరిటీ దందాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి

 *వాటర్ ఫాల్స్ లో సెక్యూరిటీ దందాలు   రోజురోజుకి ఎక్కువవుతున్నాయి*   *దీని గురించి ఎలాంటి సమాచారం కొరకు అక్కడున్న ఫారెస్ట్ అధికారులు కు సమాచారం ఇవ్వాలనుకున్న ఫోను ఎత్తకపోవడం వల్ల వాళ్లకి ముడుపులు అందుతున్నాయా అని సమాచారం* తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ ఉబ్బుల మడుగు అని పీల్చుకునికొనే జలపాతం సుందర మయమైన వాటర్ ఫాల్స్ లో  విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఫారెస్ట్ అధికారులు లంచాలకు  పాలు మారుతున్నారు.వెంటనే ఉన్నత అధికారులు దీని గుర్తించి అక్కడే నిర్వహిస్తున్న బీట్ అధికారులు ను సస్పెండ్ చేయాలని టూరిస్ట్ ప్రజలు, అలాగే నివసిస్తున్న  ప్రజలు కోరుతున్నారు

✍️మినీ మహానాడు 2025 శ్రీ నందమూరి సినీ వజ్రోతవ వేడుక

 ✍️మినీ మహానాడు 2025 శ్రీ నందమూరి సినీ వజ్రోతవ వేడుకల పోస్టర్ విడుదల కార్యక్రమం ఈ రోజు  10-5-2025 కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు 🌺 👉కువైట్ NRI TDP (కుదరవల్లి సుధాకర్ గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ )వారి ఆధ్వర్యములో "మినీ మహానాడు 2025" మరియు "ఎన్.టీ.ఆర్ గారి సినీ వజ్రోత్సవ వేడుకలు"..... #16 మే 2025, సాయంత్రం 4 గంటలనుండి బాయ్స్ స్కౌట్ ఆడిటోరియం, హవల్లీ ,కువైట్# 👉ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే పలువురు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్పీకర్ గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు,మాజీ ఎంఎల్సీ TD జనార్ధన్ గారు,ముఖ్య అతిథులుగా సినీ నటుడు నారా రోహిత్ గారు ,దుండి రాకేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్,రావి రాధాకృష్ణ NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ,బండారు వంశీ కృష్ణ తెలుగు యువత అధికార ప్రతినిధి,సింగర్ సింహ గారు తదితరులు ✌️🌹 👉కువైట్లో ఉన్న నారా, నందమూరి, పవన్ కల్యాణ్ (మెగా)గారి అభిమానులు మరియు తెలుగుదేశం, జనసేన ,బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరి ముఖ్యంగా మన తెలుగింటి ఆడపడుచులు అందరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కువైట్ NRI TDP సుగవాస...

తక్షణమే అర్బన్ యం ఈ ఓ పోస్టులు మంజూరు చేయాలి.

 తక్షణమే అర్బన్ యం ఈ ఓ పోస్టులు మంజూరు చేయాలి.   భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు 1)పురపాలక నగరపాలక టీచర్స్ కి జిపిఎఫ్ సౌకర్యము కల్పించాలి ఇప్పటికే కమిషనర్ ఖాతాలో ఉండిపోయిన పిఎఫ్ మొత్తాన్ని నూతన పిఎఫ్ ఖాతాలకు బదిలీ అయ్యేలా చూడాలనీ  2) పురపాలక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ అనుగుణంగా అవసరమైన హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఎజిటి పోస్టులు మంజూరు చేయాలని  3) తక్షణమే అర్బన్  ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి భర్తీ  చేయాలని 4) నగరపాలక సంస్థలకు మంజూరు కాబడిన ఉపవిద్యాధికారి పోస్టులను కేవలం నగరపాలక ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని  5) పదోన్నతులు డీఎస్సీ నియామకాల రేషియో 70 :30 స్పష్టత లేక ఆగిపోయిన పదోన్నతుల సమస్య వెంటనే పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని  6) పురపాలక స్పౌజ్ ఉపాధ్యాయులు కొందరు జిల్లా పరిధిలో వేరువేరు మండల /పురపాలక/ నగరపాలక/ పరిధిలో పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున అంతర్ యాజమాన్య అంతర్ జిల్లా యాజమాన్య బదిలీలు కూడా చేపట్టాలి 7)పురపాలక పాఠశాలలో 398 రూపాయలతో గతంలో పని చేసిన 350 మంది స్ప...

కేశినేని నాని సోషల్ మీడియా ట్విట్ట పై స్పందించిన ఎంపీ చిన్ని...

 *ఎన్టీఆర్ జిల్లా నందిగామ* కేశినేని నాని సోషల్ మీడియా ట్విట్ట పై స్పందించిన ఎంపీ చిన్ని... నేను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి చురకలు వేసిన ఎంపీ చిన్ని.... శత్రుదేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు... రెండు రోజుల్లో మీడియా సమావేశంలో తనపై విమర్శలు పై వాస్తవాలు తెలియజేస్తా.... నా అభివృద్ధిని చూసి నాపై దాడులు చేస్తుంటారు వారికి గట్టి సమాధానం చెప్తా : ఎంపీ చిన్ని మీ అందరి సమక్షంలో ఏం జరుగుతుందో తెలియజేస్తా....

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని

 *విజయవాడ* *పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం సిఎండి కార్యాలయంలో అధికారులకు మెమరండం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్* *కార్యక్రమంలో పాల్గొన్న* *డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసిపి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,కార్పొరేటర్లు,డివిజన్ ఇన్చార్జిలు* *దేవినేని అవినాష్ కామెంట్స్* జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పెంచిన కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందచేశాం కూటమి ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చి మాట తప్పారు పేద ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధ వేస్తుంది రెండు మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు నేడు వేయి రూపాయలు వస్తుంది చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు ఇచ్చిన హామీ ప్రకారం ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు సంక్షేమం,అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత మోగిస్తున్నారు ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె ధరలు పెంచం,ఛార్జీలు పెoచo అని బాండ్ పేపర్లు ఇచ్చారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తారు ప్రజలను మోస...