వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్

 వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ 



వినియోగ దారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశా రు . ఈ సందర్భంగా

వినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాసిల్దార్ తో చర్చించారు . వినియోగదారుల  జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ  గ్యాస్ డెలివరీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్లు డెలివరీ లోపాలు, పెట్రోల్ బంకులలో వినియోగదారులకు

జరుగుతున్న సౌకర్య లోపాలు తదితర అంశాలపై తహసిల్దార్ తో విపులంగా చర్చించి నట్లు తెలిపారు .. సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ ను  కోరడం జరిగిందని, తాసిల్దార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు...అనంతరం వినియోగదారుల హక్కుల పోస్టర్ ను తహసీల్దార్ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్ కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి పోలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,