Posts

Showing posts from August, 2025

నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలు

Image
 నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలను సిజిఆర్ ఎఫ్ చైర్మన్ కు వివరిస్తున్న కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్     పట్టణంలోని సింగు మినీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సులో కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ పాల్గొని పలు సమస్యలను విశ్రాంత న్యాయమూర్తి మరియు సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ దృష్టికి తీసుకువచ్చారు.  పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వినియోగదారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయకూడదని, అదేవిధంగా నెహ్రు నగర్ మధ్యనగర్ గుర్రాల చావిడి ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య ఉందని వారి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా విద్యుత్ ఎమర్జెన్సీ కాల్స్ కు సంబంధిత అధికారులు ఎవరూ కూడా సత్వరమే స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యుత్ షాక్ వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారాన్ని జాప్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని కోరేరు. విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్ను మరొకటి ఏర్పాటు చేయాలని, విద్యుత్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న విద...

ఈనెల 19న జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి..

Image
 ఈనెల 19న జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి....   *మురికిపూడి ప్రసాద్ కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు*  పల్నాడు జిల్లా   చిలకలూరిపేట ఈనెల 19వ తేదీ పట్టణంలోని సింగ్ మినీ ఫంక్షన్ హాల్లో జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును వినియోగదారులు ఉపయోగించుకోవాలని పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ కోరేరు. ఈ సదస్సు జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కానీ విద్యుత్ సమస్యలను ఆయన వెంటనే అక్కడే పరిష్కారం చేస్తారని తెలిపారు. వినియోగదారులు  తమ సమస్యలను ఒక పేపర్ పై వ్రాసి తెలియపరచినట్లయితే వెంటనే పరిష్కారం చేస్తారు అన్నారు. ఇది సమస్యల పరిష్కారానికి వినియోగదారులు ఎటువంటి ఖర్చు పెట్టకుండా పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.ఈ విషయం లో వినియోగదారులకు ఫోరం అండగా ఉంటుందని ఎవరైనా తమ సమస్యలను స్వయంగా తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే వినియోగదారుల సంఘం సభ్యులు ఆ సమస్యను పేపర్ పై వ్రాసి  సహకరిస్తారని ఆయన తెలిపారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గారిని కలిసిన దాడి

Image
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గారిని  కలిసిన దాడి ఈరోజు ఆగస్టు 16వ తేదీన, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ వైస్ ఛైర్మన్, విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకుడు దాడి సత్యనారాయణ గారు, ఆయనతో పాటు డి. లక్ష్మణ్ కుమార్ వెంకటేష్ గారు, ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా గవర్నర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తరఫున వినియోగదారుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలను వివరించిన దాడి సత్యనారాయణ గారి అభిప్రాయాలకు, గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారు సానుకూలంగా స్పందించారు. ఒడిశా రాజధాని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.

అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

Image
 *అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..           లోక్ సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్..* ఎందరో మహానుభావుల త్యాగఫలం, ఈ స్వాతంత్ర పుణ్యఫలం. భారతీయులు అందరూ జరుపుకునే 2 పండుగలలో  1. స్వాతంత్ర దినోత్సవం 2. గణతంత్ర దినోత్సవం  ఎందరో మహానుభావులు తమ జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టి బ్రిటిష్ వారి బానిసత్వం సంకెళ్ల నుండి మనకు స్వేచ్ఛను కల్పించారు.  ఈ 78 సంవత్సరాల్లో మనం సాధించిన లక్ష్యాలతో పాటుగా మనం సాధించాల్సిన అంశాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.  రాజ్య వ్యవస్థకు మూలం,, ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం.  ప్రజాస్వామ్యానికి పునాది చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన లేకుండా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన అది సరియైన పరిపాలన కాజాలదు.  ఈ 79వ స్వాతంత్ర్యం ప్రజల ముందు కొన్ని సవాళ్లు కనబడుతున్నాయి. 1.  కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పద అంశంగా మారిన ధర్మస్థల్. విష సర్పాలను చంపొద్దు అని ప్రచారం చేసే భారతీయ సమాజంలో కనిపించకుండా పోతున్న ఆడపిల్లల గురించి తెలుసుకో లేకపోవడం విచారకం.  2. స్వాతంత్ర ప్రతిపత్తి కలిగి రా...

ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు*

Image
 *విశాఖపట్నం బస్టాండ్‌లో ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు* బస్టాండ్ పిల్లర్‌కి, బస్సుకి మధ్యలో నలిగిపోయి మృతి చెందిన మహిళ  మృతురాలు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లికి చెందిన గేదెల ముత్యాలమ్మ(45)గా గుర్తింపు   వైజాగ్ - ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న జరిగిన దుర్ఘటన..

హోటల్లో దోశ ఆర్డర్ చేసినా, లేక అక్కడే తిన్నా సాంబారు ఇవ్వాల్సిన బాధ్యత హోటల్ వారిదే

Image
 హోటల్లో ఇడ్లీ, దోశ టిఫిన్. చేసినా, లేక అక్కడే తిన్నా సాంబారు ఇవ్వాల్సిన బాధ్యత హోటల్ వారిదే ....మురికిపూడి ప్రసాద్ అధ్యక్షులు కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం  పల్నాడు జిల్లా     ఏదైనా హోటల్ లో గాని రెస్టారెంట్లో గాని నగదు వెచ్చించి దోశ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ తిన్న లేదా పార్సెల్ చేసిన ఖచ్చితంగా సాంబార్ ను ప్రొవైడ్  చేయవలసిన బాధ్యత హోటల్ వారిది మాత్రమే.   ఇటీవల కాలంలో 2023లో జరిగిన ఒక సంఘటనపై స్థానిక వినియోగదారుల కోర్టు  50 రూపాయలు విలువ కలిగిన దోసె (అట్టు) కు సాంబారు ఇవ్వలేము అని చెప్పిన రెస్టారెంట్ కు 3500 రూపాయలు జరిమానా విధించింది.  కేసు వివరాలు  మనీష్ పాటక్  అనే న్యాయవాది రెస్టారెంట్ వారు సాంబారు వడ్డించినందుకు మరియు పార్సిల్ కూడా సాంబార్ ఇవ్వనందుకు స్థానిక వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా మొత్తం 3,500 పెనాల్టీ విధించింది. 2000 రూపాయల వినియోగదారునికి మరియు 1500 రూపాయలు కోర్టు ఖర్చుకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. న్యాయవాది ముందుగా నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించిన రెస్టారెంట్ వారిని కోర్టు మందలించింది  ఇలాంటి సంఘటన ...

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం".. మువ్వల

Image
 ప్రెస్ నోట్, " ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం".. మువ్వల   ఇటీవలే కూటమి ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి ఇచ్చిన ఆర్. సి.నెంబర్ 30/67/2025 రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ప్రతిపక్షాల,విద్యాసంఘాల గొంతులు నొక్కి ఏకపక్ష పరిపాలన చేసే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ మువ్వల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల హక్కులు,విద్యలో నాణ్యత,సామాజిక సమస్యలు వీటి గురించి ఎవరు ప్రశ్నించకుండా, పాఠశాలలోకి,హాస్టల్లోకి విద్యార్థులు యూనియన్ నాయకులు గాని రాజకీయ నాయకులు గానీ ఏ అన ధికార వ్యక్తులు లోపలికి రాకూడదనే నిబంధనలు విధించడం అన్యాయం అన్నారు. విద్యాసంస్థల్లో జరుగుతున్న అనేక అవకతవకలు బయటకు రాని ప్రమాదం ఉందని అన్నారు. అనేక చోట్ల వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, విద్యార్థులకు పెట్టే భోజనము, వసతులు పరిశీలించ దానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మరింత రెచ్చిపోయి స్వలాభం కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి విప్పి  చేసి...

విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన సంస్థలు.

Image
 విద్యార్థి తల్లిదండ్రులారా... ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయడానికి  కొన్ని ప్రధాన సంస్థలను సంప్రదించవచ్చు. , ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) మరియు ఉన్నత విద్యా మండలి (APSCHE)..ఈ రెండు ..  విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి  ప్రధాన సంస్థలు. మీరు సంప్రదించదగిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి: 1. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) ఇవి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన సంస్థలు. రుసుము సమస్యలు, కళాశాలల తీరుతెన్నులు వంటి విషయాలపై ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.. . (APHERMC)..  * ఫోన్ నంబర్లు:    * సాధారణ ఫిర్యాదుల కోసం: 8712627318    * సాధారణ కార్యాలయ విచారణల కోసం: 08645 - 274443  * మెయిల్ ఐడి:    * ఫిర్యాదులకు సంబంధించి: grievanceaphermc@gmail.com    * సాధారణ కార్యాలయ విచారణల కోసం: aphermc@gm...