గిరిజన సంఘాలు ఏకతాటి పైకి రావాలి

 గిరిజన సమాఖ్యకు వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలి.సీపీఐ నాయకులు.



గిరిజన సంఘాలు ఏకతాటి పైకి రావాలి.ప్రజా సంఘాల నాయకులు.


బి.శ్రీను నాయక్ కు ఘన సన్మానించారు.

 

చిలకలూరిపేట న్యూస్ 9 సెప్టెంబర్-9.

ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ను వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు. గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటా నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  బాబూరావు మాట్లాడుతూ  గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు (వైవి) మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రజలపై అనుసరిస్తున్న ద్వంద వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు రావు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికోసం ఉద్యమాలు చేయాలన్నారు. కౌన్సిలర్ వి.కోటా నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి బి. శ్రీను నాయక్ పోరాటంలో ఉన్నారని, ప్రతిఫలం అసించకుండా గిరిజన ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో గిరిజన ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చేయాలని తెలిపారు. ఆర్ పిఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య  మాట్లాడుతూ శ్రీను నాయక్ మొట్టమొదటి నుంచి వామపక్ష భావాజాలంతా ఉన్నారని,సీపీఐ గుర్తించి గిరిజన సమాఖ్య రాష్ట్ర సాహయ కార్యదర్శి పదవి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు పొందాలన్నారు. బీసీ నాయకులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, తుర్లపాటి వెంకట నగేష్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు సలికి నీడి నాగరాజు మాట్లాడుతూ గిరిజన ప్రజల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం శ్రీను నాయక్ కృషి చేస్తున్నారని, ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కన్జ్యూమర్స్ రైట్ ప్రొడక్షన్ అధ్యక్ష, కార్యదర్శులు మురికిపూడి ప్రసాద్, రవి నాయక్ మాట్లాడుతూ యడవల్లి భూములతో పాటు, మరికొన్ని గ్రామీణ ప్రాంతాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రీను నాయక్ పోరాటాలు చేశారని, ఆ కార్యక్రమంలో మేము కూడా పాలుపంచుకున్నామని, గిరిజన హక్కుల కోసం మరిన్ని పోరాటాలు చేయాలన్నారు.అనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి గా పదవి పొందినందుకు బి.శ్రీను నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చౌటుపల్లి నాగేశ్వరరావు, లక్షాధికారి,ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుభాని, చేతన్ న్యూస్

 సిఈఓ చెన్నకేశవుల రాంబాబు, గిరిజన,ఎస్సి, బి.సి,ముస్లిం మైనారిటీల సంఘాల  నాయకులు బి.చిన్న నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, సిద్ధాంతి షేక్ కరిముల్లా, పాశం సురేష్, గుంజి బాలసుబ్రమణ్యం, బి. బాలకోటి నాయక్ కంచర్ల శ్రీనివాసరావు, ఆర్ మోహన్ నాయక్, తన్నీరు శ్రీనివాసరావు, బి.అంజిబాబు నాయక్, కె.రామాంజనేయులు, పుట్టా వెంకట బుల్లోడు, చుండూరి ఆనంద్ బాబు, హరి ప్రసాద్,తోపాటు తదితర సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-