చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం
చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం
కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్
పట్టణంలో కళామందిర్ సెంటర్ మీదుగా చీరాల వెళ్ళు రహదారి నరసింహ స్వామి గుడిమలుపు రోడ్డు అంతా కూడా పూర్తిగా దెబ్బతిందని, ఇప్పటికే సగం రోడ్డు కోతకు గురై గుంటలు పడినవని ఇది జాతీయ రహదారుల శాఖ మరియు పురపాలక సంఘం సమన్వయంతో పనిచేసే ఈ సమస్యను పరిష్కరించాలని మురికిపూడి ప్రసాద్ కోరారు. రహదారికి ఒకవైపు నివాస గృహాలు ఉన్నాయని వాటికి కాలువ లేకపోవడం వల్ల ఎన్ని సార్లు బాగు చేసినా కూడా నీళ్లు నిలబడి రోడ్డు దెబ్బతిన్నదని ప్రసాద్ అన్నారు.
కావున మున్సిపల్ అధికారులు కూడా సమస్యను పరిశీలించి రహదారి పక్కన నీళ్లు నిలబడకుండా చేయాలని ఆయన కోరారు
Comments
Post a Comment