నరసరావుపేట లోని తుఫాను

 న్యూస్ 9 రిపోర్టర్

*నరసరావుపేట లోని తుఫాను* *ప్రభావిత ప్రాంతాల్లో* *పర్యటించి ప్రజలకు పులిహోర* *పొట్లాలు మరియు మంచినీళ్లు అందించిన* *పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్* *పార్టీ కార్యనిర్వాహక* *అధ్యక్షులు డాక్టర్* *శ్రీ గోపిరెడ్డి* *శ్రీనివాస్ రెడ్డి గారు!







 *తుఫాను సహాయక చర్యలను చేపట్టాలని* *ముఖ్యమంత్రి పదే పదే చేసిన హెచ్చరికలను* *బేఖాతరు చేసిన నరసరావుపేట ప్రభుత్వ యంత్రాంగం* ! 


 *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో* 

 *ప్రజలకు ఆహారం మరియు మంచినీటి* *సరఫరా కూడా చేయలేని దుస్థితిలో నరసరావుపేట* *ప్రభుత్వ యంత్రాంగం!* 


 *స్థానిక శాసనసభ్యులు అటు ఇటు* *తిరుగుతాడు తప్ప* *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో* *ప్రజలు పడుతున్న* *ఇబ్బందులను గురించి* *పట్టించుకోవడం లేదు* !


 *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న* *ఇళ్లకు నష్టపరిహారం తక్షణమే అందజేయాలి* !


 *సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం* *చేయటం వల్లనే  తుఫాను* *సహాయక చర్యలకు* *అంతరాయం!*

 

 *తుఫాను సహాయక చర్యల్లో* *నిర్లక్ష్యాన్ని వీడండి _* *పల్నాడు జిల్లా వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహ* *అధ్యక్షుడు డాక్టర్* *శ్రీ* *గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి* *గారు* 


           *********

నరసరావుపేట పట్టణంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలైన చంద్రబాబు నాయుడు కాలనీ మరియు బరంపేట లో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పర్యటించి అక్కడి ప్రజలకు పులిహార పొట్లాలు మరియు మంచినీటి  బాటిల్స్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....


గత మూడు రోజులుగా మోంధా తుఫాను కు సంబంధించి ముఖ్యమంత్రి గారు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న నరసరావుపేట ప్రభుత్వ యంత్రాంగం వీటిని బేఖాతలు చేసిందనీ,


 స్థానిక సత్తనపల్లి రోడ్డులోని చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద ఉన్న వాగు పొంగి చంద్రబాబు నాయుడు కాలనీలో 10 లైన్లు బరంపేటలోని నాలుగు లైన్లు మరియు స్టేడియం నీట మునిగిపోయినా ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబించిందని, తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఇక్కడ చెట్లు విరిగి కరెంటు స్తంభాలు కూలిపోయినా సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని, నీట మునిగిన చంద్రబాబు నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆహారం వండుకునే పరిస్థితి లేదని, నరసరావుపేట మున్సిపల్ అధికారులు నామమాత్రంగా కూడా స్పందించలేదని, ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయినప్పటికీ ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ ఒక ఆహార పొట్లం గాని మంచినీరు గాని సరఫరా చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే లేచిన దగ్గర నుంచి అటు, ఇటు తిరుగుతాడు తప్ప తుఫాను ప్రభావిత ప్రాంతాలకు గురైన ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఈయనకు తుఫాను సహాయక కార్యక్రమాల మీద సరైన అవగాహన మరియు సమయస్ఫూర్తి లేకపోవడమే కారణమని,ఇది చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను తొలగించి, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్లనే సకాలంలో సహాయక చర్యలను చేపట్ట లేకపోయిందని , గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది చేత దెబ్బతిన్న ఇళ్లను సర్వే చేయించి వారికి ఆరువేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తుఫాను ప్రభావిత ప్రాంతమైన చంద్రబాబునాయుడు కాలనీ మరియు బరంపేట లో పులిహార పొట్లాలను మరియు మంచినీటి  బాటిళ్లను అందజేశారు, అదేవిధంగా పలనాడు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయని తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సహాయక చర్యలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం