తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు!

 *తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు!*








*వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు మరియు డామేజ్ జరిగిన ఇళ్లకు సర్వే చేయించి వెంటనే ఆర్థిక సహాయం అందించాలి!*


*చంద్రబాబు నాయుడు కాలనీలో 10 లైన్లు బరంపేటలో రెండు లైన్లు నీట మునిగిపోయాయి!*


*బరంపేటలో విద్యుత్ స్తంభం విరిగిపడిన చెట్లు కూలి పోయినా సంబంధిత అధికారులు ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదు!*


*ముఖ్యమంత్రి పదేపదే విజ్ఞప్తి చేసిన నిధులు విడుదల చేసినా నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు ఎక్కడా పునరావస కేంద్రాలు గాని ,వర్షాభావ ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్లాలు అందించటం గాని చేయలేకపోయాయి!*


*నరసరావుపేట మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు!*

      ************


*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించటం జరిగింది,*


*ఈ పర్యటనలో భాగంగా ఆయన సత్తనపల్లి రోడ్ లోని స్టేడియం మరియు చంద్రబాబు నాయుడు కాలనీ ,బరంపేట ప్రాంతాల లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....మొంథా తుఫాను కారణంగా ఈదురు గాలులు వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది.*


 *గత మూడు రోజులుగా ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తోంది.ప్రస్తుతం నరసరావుపేట సత్తెనపల్లి రోడ్ లోని చంద్రబాబునాయుడు కాలనీ స్టేడియం వద్ద  వాగు పొంగిపొర్లుతుంది. వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి*


*చంద్రబాబునాయుడు కాలనీలో సుమారు పది లైన్లు నీట మునిగిపోయి ఉన్నాయి, బరంపేటలో ఒక నాలుగు లైన్ నాలుగు లైన్లు నీట మునిగిపోయి ఉన్నాయి. స్టేడియం కూడా మునిగిపోయింది*


*ఇక్కడ వాగు ద్వారా వచ్చే నీళ్లతో ఈ పరిస్థితి ఏర్పడింది.ఈ చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద ఉన్న వాగు చప్టా పూర్తిగా నిండిపోయి చంద్రబాబునాయుడు కాలనీలోకి నీరు వచ్చింది  స్టేడియం కూడా నిండిపోయే పరిస్థితి రావడానికి  కారణం ముఖ్యంగా ఇక్కడ ఒక లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి*


 లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్లే ఈరోజు స్టేడియం కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది .

 బరంపేటలో కరెంటు స్తంభాలు విరిగిపడి రాత్రి నుంచి ఉన్న సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఇంతవరకు సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం  వహిస్తున్నారు.

ఇప్పటివరకు దీన్ని క్లియర్ చేయడానికి అధికారులు ఎవరు రాలేదు.

 చంద్రబాబు నాయుడు కాలనీ మొత్తం నీటి మునిగి పోయి ఇళ్లల్లో నీళ్లు వచ్చి ఆహారం వండుకునే పరిస్థితులు లేవు.వీరికి పులిహార ప్యాకెట్లు గానీ భోజనం ప్యాకెట్లు గాని మున్సిపల్ అధికారులు ఇంతవరకు సరఫరా చేయలేదు.  ముఖ్యమంత్రి గారు తుఫాను కారణంగా తక్షణ చర్యలు చేపట్టమని పదేపదే విజ్ఞప్తి చేసిన కలెక్టర్లకు నిధులు రిలీజ్ చేసినప్పటికీ కూడా  నరసరావుపేట మున్సిపాలిటీలో ఎక్కడ పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయటం గాని, ఆహారం సరఫరా చేయటం గాని ఇంతవరకు జరగలేదంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దాదాపు 10 గంటలు కావస్తుంది, ఇంతవరకు ఆహార ప్యాకెట్ల పంపిణీ చేయడం జరగలేదు.రెండో లైన్లో ఒక చెట్టు పడిపోయి కరెంటు పోల్స్ అన్ని పడిపోయి ఉన్నాయి రాత్రి నుంచి కరెంట్ లేదు పునరుద్ధరించడానికి ఇంతవరకు ఎవరు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 25 కేజీల పులిహార ఇప్పుడు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కాలనీలో పేద ప్రజలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తాం.  వర్ష ప్రభా విత ప్రాంతాలైన ఇలాంటి ప్రదేశాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలలో చేర్చాల్సిన పరిస్థితి ఉంది , పునరావాస కేంద్రాల కు సంబంధించి ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చారు గాని అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు .

మున్సిపల్ పట్టణ కేంద్రంలోనే ఈ రకంగా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు .

ఇల్లు నీట మునిగిపోయి పూర్తిగా డామేజ్ జరిగిన ఇ ళ్ళకి మరియు పూర్తిగా తడిసిపోయిన ఇళ్ళకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దెబ్బతిన్న ఇళ్లకు ఇంటింటికి 5వేల రూపాయలు పంపిణీ చేశాం ,వాలంటీర్ల చేత సర్వే చేయించి ప్రతి ఇంటికి 5000 రూపాయలు అందజేసే కార్యక్రమం చేశాం .

ఇప్పుడు కూడా వీఆర్వో గాని సంబంధిత సచివాలయం సిబ్బంది ద్వారా గాని సర్వే చేపించి తక్షణమే వారికి ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమం చేయాలి .

ముందు తక్షణం ఆహార ప్యాకెట్లు మంచినీళ్లు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అందజేయాలి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం