విష్ణు బిల్డర్స్ నిర్మించిన మెగా టౌన్ షిప్ అపార్ట్మెంట్ లో మాకు కేటాయించిన సెల్లార్లో వేరే వాళ్ళు షాపులు నిర్మిస్తున్నారని
న్యూస్ 9 ఛానల్
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం
![]() |
విజయవాడ అయప్పనగర్ లో విష్ణు బిల్డర్స్ నిర్మించిన మెగా టౌన్ షిప్ అపార్ట్మెంట్ లో మాకు కేటాయించిన సెల్లార్లో వేరే వాళ్ళు షాపులు నిర్మిస్తున్నారని న్యూ ఆర్టీసీ కాలనీ,ఎలక్ట్రిసిటీ కాలనీ పరిసర ప్రాంతాల అభివృద్ధి కమిటీ సెక్రటరీ బచ్చు వెంకటనారాయణ ,అపార్ట్మెంట్ వాసులు కె.రాజశేఖర్ రెడ్డి, కె దుర్గా వరప్రసాద్ రెడ్డి తండ్రి పాండురంగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బచ్చు వెంకటనారాయణ,రాజశేఖర్ రెడ్డి ప్లాట్, షాప్ ల ఓనర్, దుర్గా వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ
1999 విష్ణు బిల్డర్స్ మెగా టౌన్షిప్ ను ప్రారంభించడం జరిగింది.అప్పట్లో కొంతమంది షాపులు నిర్మించడం జరిగిందని,
అసోసియేషన్ తరుపు మేము వ్యతిరేకించడం జరిగిందన్నారు.
అప్పటి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ షాపులను తొలగించడం జరిగింది.తొలగించిన తర్వాత ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగలేదని,
ప్రస్తుతం వేరే అపార్ట్మెంట్ నుండి కొంతమంది వచ్చి మీ అపార్ట్మెంట్ పార్కింగ్ నేను కొనుగోలు చేశాను అని చెప్పి గోడలు కట్టడం జరిగిందని,
2 సంవత్సరాల క్రితం కమిషనర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది.అప్పుడు తక్షణమే ఆపివేయటం జరిగిందన్నారు .
సెల్లార్లో అనది కారికంగా షాపు నిర్మించడమే కాకుండా షాపు పక్కనే మాంసపు దుకాణం కూడా ఉండటం వల్ల దుర్వాసనతో అపార్ట్మెంట్ వాసులు ఉండలేకపోతున్నారు.
నాకు ల్యాండ్ లో షేరింగ్, పార్కింగ్ లో షేరింగ్ ఉన్నదని బయట వ్యక్తులు కొంతమంది వచ్చి పార్కింగ్ ను కబ్జా చేస్తున్నారు,ఏమిటని ప్రశ్నిస్తే మాపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని,పార్కింగ్ ప్లేస్ లో కార్లు, వెహికల్స్ లేకుండా షాపులుగా నిర్మిస్తున్నారు.
అపార్ట్మెంట్ వాసులు బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది...

Comments
Post a Comment