ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కృతిక శుక్లా

 *ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కృతిక శుక్లా*

   


   

నరసరావుపేటలో మార్కెట్ యార్డ్ నందు ఉన్న  ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను  జిల్లా కలెక్టరు కృతిక శుక్లా  తనిఖీ చేశారు. ఈవియం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భధ్రతా ఏర్పాట్లను ఈవియం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి  పరిశీలించారు. అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవియం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు  మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవియం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఎప్పటి కప్పుడు గౌడౌన్ ను క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. ఈవియం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి