వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మహిళలు అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని

 వినియోగదారుల హక్కులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి



చిలకలూరిపేట

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మహిళలు అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని **కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్** పేర్కొన్నారు.  


గురువారం చిలకలూరిపేట పట్టణంలో వినియోగదారుల సంఘం సభ్యులు బృందాలుగా ఏర్పడి నరసరావుపేట సెంటర్, కళామందిర్ సెంటర్, చౌత్రా సెంటర్ తదితర ప్రధాన వీధుల్లో మహిళలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ **కరపత్రాలు పంపిణీ*చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం, సరైన తూకాలు, పాటించడం, కల్తీ ఆహార పదార్థాల గుర్తింపు వంటి అంశాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  


మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు తూకాల్లో మోసం చేయడం, నాణ్యత లేని వస్తువులను విక్రయించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగాగ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు పాటించవలసిన అంశాల గురించి వివరిస్తూ 

సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో 

గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన బిల్లు మాత్రమే చెల్లించాలని, ఇతర చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు. అదేవిధంగా 

 బరువు చెక్ చేసి సిలిండర్‌పై ఉన్న నెట్ వెయిట్ (సాధారణంగా **14.2 కిలోలు**) సరిపోతుందో లేదో డెలివరీ బాయ్ దగ్గరే తూకం వేయించాలని చెప్పారు.సీల్ పరిశీలించి సిలిండర్‌పై ఉన్న సీల్ సరిగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని, తెరిచి లేదా డ్యామేజ్ అయిన సీల్ ఉన్న సిలిండర్ను తీసుకోవద్దని తెలిపారు.లీకేజీ సమస్య కూడా చెక్ చేసుకోవాలని,  సిలిండర్ తీసుకునే ముందు గ్యాస్ వాసన వస్తుందో లేదో పరీక్షించి అనుమానం ఉంటే వెంటనే తిరస్కరించాలి అని సూచించారు. అనంతరం సిలిండర్ పై ఉన్న ఎక్స్పైరీ తేదీనిA, B, C, D** కోడ్ ద్వారా గడువు తేదీని గుర్తించి, గడువు ముగిసిన సిలిండర్ అయితే రిటర్న్ చేయాలని చెప్పారు

బిల్లు కూడా తీసుకోవాలని అన్నారు. కోశాధికారి బేబీ విక్రమ్ మాట్లాడుతూ కల్తీ పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నందున నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయాలని మహిళలకు సూచించారు. సమయంలో బిల్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని హితవు చెప్పారు.

ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం సభ్యులు** మహిళలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి నాయక్, డాక్టర్ విద్యాసాగర్ గాలయ్య, పుష్పవల్లి, పొన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి