విద్యార్థుల ప్రతిభకు వేదికగా నారాయణ స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
విద్యార్థుల ప్రతిభకు వేదికగా నారాయణ స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
చిలకలూరిపేట, మార్చి 5, న్యూస్ 9
చిలకలూరిపేటలోని Narayana School బ్రాంచ్‌లో నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విద్యా ప్రగతి, ప్రతిభను తల్లిదండ్రుల ముందు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా AGM వై. లక్ష్మణ్ రెడ్డి, ZCO గౌసియా హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు, మోడల్స్ మరియు వివిధ క్రియేటివ్ వర్క్‌లను స్వయంగా వివరించి తల్లిదండ్రులకు తమ అభ్యాస స్థాయిని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శేషగిరిరావు అధ్యక్షత వహించి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ నాగవర్ధని పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు విద్యార్థులు తమ అభ్యాసాన్ని స్వయంగా వివరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments
Post a Comment