ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు
న్యూస్ 9 ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ:
రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీ తో జీర్ణ కోశ , లివర్ వ్యాధి సమస్యలను, పరిష్కరించేందుకు ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని విశాఖ పార్లమెంట్ సభ్యులు మార్గాన భారత్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నగరంలో విజయవాడ లాంటి నగరం మెడికల్ హబ్ గా ఏర్పడిందని ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వైద్యం అందించే వైద్యులు ఉన్నారని ప్రశంసించారు.
విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఐ టీ ఐ కళాశాల రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండస్ ఆసుపత్రిని పార్లమెంట్ సభ్యులు భారత్, కేశినేని చిన్ని, శాసన సభ్యులు గద్దె రామ మోహనరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, పారిశ్రామిక వేత్తలు ,పలువురు ఉన్నత అధికారులు ఇండస్ ఆసుపత్రి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీ తో జీర్ణ కోశ సమస్యలను, పరిష్కరించేందుకు ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని నగరంలో విజయవాడ లాంటి నగరం మెడికల్ హబ్ గా ఏర్పడిందన్నారు. గతంలో ఏ అనారోగ్య సమస్యలకైనా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేదని ప్రస్తుతం ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వైద్యం అందించే వైద్యులు విజయవాడలోనే అందుబాటులో ఉన్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోనే హెపటాలిజీ సేవలు ఇక్కడ అందిస్తున్నామని డాక్టర్ వైష్ణవి కొండా తెలిపారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ లివర్ కు సంబంధించి అత్యధిక వైద్




Comments
Post a Comment