చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం
*చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం**
![]() |
*ముఖ్యఅతిథిగా మండవనేని చరణ్ తేజ **
*చిలకలూరిపేట
* పట్టణంలోని ఆరెంజ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన *'రిలాక్స్ టీ స్టాల్'* సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రోహిత్ మనీ మరియు బండారు మని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ ప్రదాత, ప్రముఖ నాయకులు *మండవనేని చరణ్ తేజ హాజరయ్యారు.
ఈ సందర్భంగా చరణ్ తేజ రిబ్బన్ కట్ చేసి స్టాల్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువకులు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ రోహిత్, మనిలు ఈ వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.స్థానిక ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన రుచులతో ఈ టీ స్టాల్‌ను తీర్చిదిద్దిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment