వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరి కి పూర్తి అవగాహన

*వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం* 

ఆర్టీసీ డిఎం యద్దనపూడి వేణుబాబు

ఆర్టీసీ బస్టాండ్‌లో కరపత్రాల పంపిణీ – ప్రయాణికులకు అవగాహన


వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని చిలకలూరిపేట ఆర్టీసీ డీఎం యద్దనపూడి వేణుబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారుల హక్కుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వినియోగదారులేనని, మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేయడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ సేవలు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసే వారందరూ వినియోగదారుల హక్కుల చట్ట పరిధిలోకి వస్తారని వివరించారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, వస్తువుల నాణ్యత, గ్యారెంటీ, వారంటీ వంటి అంశాలను పరిశీలించే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందన్నారు. నాణ్యమైన వస్తువు లేదా సేవ పొందే హక్కుతో పాటు మోసపోయిన సందర్భాల్లో నష్టపరిహారం కోరే హక్కు కూడా చట్టం కల్పిస్తోందని తెలిపారు.


వినియోగదారులు మోసపోయినప్పుడు లేదా నాసిరకం వస్తువులు అందినప్పుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ, “బిల్లు తీసుకోవడం చిన్న విషయం అనుకోవద్దు. అదే వినియోగదారుడికి చట్టపరమైన రక్షణ కల్పించే ప్రధాన ఆధారం” అన్నారు. ఈ కార్యక్రమంలో  వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, సెక్రటరీ గాలయ్య, జాయింట్ సెక్రటరీ పొన్నం శ్రీనివాసరావు, పుష్పవల్లి, రవి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి