అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్..
న్యూస్ 9 ఛానల్
*అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్*
ఎన్టీఆర్ జిల్లావిజయవాడ :
అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ (ఐహెన్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజనందన్ విజ్ఞాన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బట్టు రాజేష్ ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు సైతం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ నందన్ విజ్ఞాన్, బట్టు రాజేష్ విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) కనీస వసతులు లేవన్నారు. 48 శాతం మంది వైద్యులు, 62 శాతం మందులు, 71 శాతం ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా విఫలమైందదన్నారు. ఉచిత వైద్యం అందించకుండా ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం సరి కాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం లబ్ధిదారులకు చేరాల్సిన ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల వేల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ గతంలో 'లైఫ్తమ్' పేరిట రూ.999 వసూలు చేసి, ఇప్పుడు నెలవారీ రీఛార్జ్ అడగడం వినియోగదారులను మోసం చేయడమే అని చెప్పారు. ఇటువంటి మోసపూరిత 'డిజిటల్ హత్యల'పై, ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కులమతాలు, పేద, ధనిక తేడాలు లేకుండా నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింప చేయాలన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు నదీ గర్భంలో ఉందని.. అటువంటి రాజకీయ నాయకుల ఇళ్లను కూడా ప్రభుత్వం కూల్చగలదా? అని సవాల్ విసిరారు.ఈ ఏడాది (2026) జరిగిన 'నీట్' పేపర్ లీకేజీ వల్ల 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్రం దీనిపై తక్షణమే స్పందించాలన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ భారం తగ్గించడం లేదన్నారు. పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలు ఇస్తూ, ప్రతి నెలా 7వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అనేక ప్రజా సమస్యలపై ఐ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో రానున్న కాలంలో పోరాటం చేస్తామని తెలిపారు.

Comments
Post a Comment