జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు..

 న్యూస్ 9 ఛానల్ కృష్ణాజిల్లా

పెనమలూరు మండలం కానూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు..












ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకుడు మరియు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నే శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు..


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 మార్కులపైగా 20 మంది విద్యార్థులకు రావడం శుభ పరిణామం అని అన్నారు.


ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో చదివి జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుని అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతామని అన్నారు. రాబోయే కాలంలో ఈ పాఠశాల నుంచి మరింత మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.



ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి విజయలక్ష్మి, ఉపాధ్యాయుల సంఘం నేత కొనకల్ల రెడ్డమ్మ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోకినాల అజ్రయ్య.. తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి