మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్
తాసిల్దార్ నుంచి నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్
మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామకం
చిలకలూరిపేట................
చిలకలూరిపేట మండల స్థాయి పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు రవి నాయక్, బేబీ విక్రమ్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు మండల తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ గురువారం వారికి నియామక ఉత్తర్వుల ప్రతులను అందజేశారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ వ్యవస్థ) పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవడానికి విజిలెన్స్ కమిటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించడం, లబ్ధిదారుల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడం కమిటీ సభ్యుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.
వినియోగదారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా రవి నాయక్, బేబీ విక్రమ్‌లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ, అనేక మంది వినియోగదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలో అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్–2013 నిబంధనలు గ్రామ, మండల స్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రేషన్ దుకాణాల పనితీరు, నిత్యావసర సరుకుల పంపిణీ, లబ్ధిదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు.
నియామకం సందర్భంగా రవి నాయక్, బేబీ విక్రమ్‌లు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు చేరేలా కృషి చేస్తామని, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత అంకితభావంతో సేవలందిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ ఇరువురిని అభినందించి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. స్థానిక వినియోగదారుల సంఘం ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
.jpg)
Comments
Post a Comment