డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్

 అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని దేవపట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 24-7-2026న మెగా పేరెంట్స్ మీటింగ్ గణనీయంగా జరుపుకోవడం జరిగినది.








 ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా పనిచేస్తుందని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ సునీత మిగతా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ

 ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా పనిచేస్తున్నామని  తెలియజేశారు సరికొత్త ఆలోచనలతో విద్య వ్యవస్థలో  అధునాతమైన మార్పులు  తీసుకొచ్చే విధంగా

దానిలో భాగంగానే గత సంవత్సరంలో పదో తరగతి పరీక్ష లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అద్భుతంగా రాణించారాణి తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అందించే దిశగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా చేయాలన్నదే మా ధ్యేయమని ప్రిన్సిపాల్ అన్నారు.అలాగే తల్లికి వందనం పథకం కూడా ప్రతి విద్యార్థికి అందే విధంగా మా పాఠశాల సిబ్బంది పనిచేస్తుందని లీప్ యాప్ ద్వారా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ను యాప్ లోనే తెలుసుకోవచ్చని  ఆమె తెలిపారు. మెగా పేరెంట్స్ మీటింగ్ కు హాజరైన ఇటువంటి  తల్లిదండ్రులకు ముగ్గులు పోటీలు మ్యూజికల్ చైర్స్ ఆటల ప్రోగ్రాములను ఆడించడం జరిగినది అందులో గెలుపొందినటువంటి పేరెంట్స్ కి బహుమతులను ఇవ్వడం జరిగినది.ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కు.ముఖ్య అతిథిగా టిడిపి మండల నాయకుడు నాగేశ్వర్ నాయుడు  రావడం జరిగినది.ప్రభుత్వం పిల్లలకి అందిస్తున్నటువంటి పథకాల గురించి వాళ్ళ భవిష్యత్తును గురించి వారికి మునుముందు ప్రభుత్వం తల్లికి వందనం కొనసాగుతుందని అలాగే చదువుతోపాటు పిల్లలకు స్కిల్స్ కూడా ముఖ్యమని స్కిల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగినదని తెలిపారు. అదేవిధంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు సరికొత్త ఆలోచనలతో విద్య వ్యవస్థలో  అధునాతన మైన మార్పులు తీసుకొచ్చారని  ఆయన తెలిపారు.

 ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలు పాల్గొనడం జరిగింది

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది