Posts

అగంతకుని కదలికలతో భయపడుతున్న మచిలీపట్నం వాసులు

Image
*అగంతకుని కదలికలతో భయపడుతున్న మచిలీపట్నం వాసులు* *ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఇటీవల దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు* *మచిలీపట్నంలో ఓ అగంతకుడు అర్ధరాత్రి సమయంలో ముఖానికి మాస్క్ ధరించి, ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని, ఇంకో చేత్తో టార్చ్ లైట్ పట్టుకుని గోడలు దూకి పలువురు ఇళ్లలో ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.* *ఈ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లక్ష్మణాపురం, భాస్కరపురం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సీసీ కెమెరాలను రికార్డయిన దృశ్యం*

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చి 2025 నర్సరావుపేట పలానాడు జిల్లా లో

Image
 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చి 2025 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చి 2025 నర్సరావుపేట పలానాడు జిల్లా లో జరిగినటువంటి కార్యక్రమం లో CRPFI ప్రెసిడెంట్ విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ రవినాయక్ జాయింట్ జనరల్ సెక్రటరీ విక్రమ్ పాల్గొనటం జరిగింది

కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO)

Image
కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO) కన్పూర్ సంస్థ సహకారం తో  విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు పంపణి *విజయవాడ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటరియం లో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ  కార్యక్రమం  *విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ లక్ష్మి శ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ *విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ  *ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదు.. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం  *జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి మూడు నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం  *2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు..  * ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే  ఈ విషయంపై దృష్టి పెట్టాము

చింతామణి మదనపల్లి రోడ్డులో ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో

Image
 చింతామణి బ్రేకింగ్ న్యూస్  చింతామణి మదనపల్లి రోడ్డులో ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  చింతామణి మదనపల్లి రోడ్డు, గోపల్లి విలేజ్ మధ్య బెంగళూరు మదనపల్లి తిరుపతిలో జోగాయనహళ్లి వెళ్తున్న భారతి ప్రైవేట్ బస్సు, కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో బస్సులోని ఐదుగురిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.  కడప నుంచి బెంగుళూరుకు బులెనో కారు వెళ్తున్నట్లు సమాచారం.  ఈ ప్రమాదంలో కారులో ధనంజయ్‌, అతని తల్లి కళావతి సహా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.  శోభ, మాన్విత, మాదేవిలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడడంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో వారిని చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  డీవైఎస్పీ మురళీధర్‌, కెంచర్లహళ్లి పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావ్ణప్ప రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ శివరాజ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మమత అగ్నిమాపక సిబ్బంది లోకేష్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన కారును అదుపు చేశారు.  మరోవైపు జిల్లా రక్షణ అధి...

అదనపు కట్నం కోసం వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపింపచేసి

Image
  కృష్ణాజిల్లా పోలీస్ *అదనపు కట్నం కోసం వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపింపచేసి, భార్య మరణానికి కారణమైన కేసులో ముద్దాయికి 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.3000 జరిమానా విధించిన గౌరవ VI ADJ కోర్ట్  మచిలీపట్నం వారు.* నిందితుడికి శిక్ష పడటంలో సమర్ధవంతముగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని  కృష్ణా జిల్లా యస్.పి. శ్రీ ఆర్. గంగాధరరావు, ఐ.పి.యస్. గారు ప్రత్యేకముగా అభినందించారు. ▪️వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన వెంకటరామ ప్రసాద్ తన యొక్క రెండో కుమార్తెను గూడూరు మండలం ఆకుమరు గ్రామానికి చెందిన రామకృష్ణ కు 2017లో ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందని కారణం మరియు అదనపు కట్నం పేరుతో భర్త, అత్త వేధింపులు మొదలుపెట్టారు.  ▪️ఆ వేధింపులు తాళలేక 2020 సంవత్సరంలో వివాహిత ఉరివేసుకొని మరణించగా, ఆమె తండ్రి అత్తింటి వారిపై అనుమానంతో మృతురాలి భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.  అప్పటి ఎస్సై సిహెచ్ కనకదుర్గారావు గారు కేసు నమోదు చేయగా, డిఎస్పి మహబూబ్ బాషా గారు విచారణ చేపట్టి చార్జ్ షీట్ దాఖలు చేశారు. సాక్షులు అందరూ సకాలంలో కోర్...

గోరా టెక్నో హబ్ ప్రారంభోత్సవం ఘనంగా...

Image
 విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచేందుకు గోరా టెక్నో హబ్  కీలక పాత్ర పోషించాలని డీ.ఆర్.డీ.ఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడ  బెంజ్ సర్కిలులో నాస్తిక కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోరా టెక్నో హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) ఫార్మర్ చైర్మన్, డిఫెన్స్ మినిస్టర్ సైన్టిఫిక్ అడ్వైజర్, గవర్నింగ్ బాడీ ఆఫ్ ద ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి విచ్చేసి హబ్ ప్రారంభించారు.  ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ సతీష్ రెడ్డి ప్రసంగిస్తూ తరతరాలుగా సమాజం కోసం దేశం కోసం పరితపిస్తున్న గోరా కుటుంబం సమాజంలోని రుగ్మతలు, కుల వ్యవస్థ, మూఢనమ్మకాలపై పోరాటం సాగించిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలతో పురోగమిస్తూ శాస్త్ర విజ్ఞానం పట్ల పిల్లలు, యువతలో ఆసక్తి పెంచేందుకు అనునిత్యం గోరా కుటుంబం కృషి చేస్తున్నారన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ గోరా సైన్స్ హబ్ లో స్పేస్ సైన్స...

ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవుపై మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడి.....

Image
 *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవుపై మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడి.....* *తమకు లభించిన సమాచారం మేరకు దాడి చేశామని తెలిపిన మైనింగ్ అధికారులు* *దాడిలో అక్రమ రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్ల సీజ్* *మొత్తం 23 ట్రాక్టర్లు పట్టుకోగా పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో 8 ట్రాక్టర్లు పరార్.....* *చాలా రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న.... మండల పరిధిలో అనేక ప్రాంతాల్లో  ఇసుక తవ్వకాలు జరుగుతున్న .. ఈరోజు దాడి చేయడంతో ఉత్పన్నమవుతున్న పలు అనుమానాలు....* *తమకు వాటాలు దక్కలేదన్న అక్కసుతో స్థానిక నేతలే సమాచారం అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి......*

సామాన్యుడి ఆవేదన

Image

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు*

Image
 *▫️దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు* *ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు* *హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు* *పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు ?* *విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు* *విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు?* *ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్న శ్రీ చైతన్య ?*  *మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో  కొనసాగుతున్న సోదాలు*

దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయనగరం జిల్లా నూతన అధ్యక్షురాలిగా పెంటపాటి రుక్మిణి నియామకం

Image
 దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయనగరం జిల్లా నూతన అధ్యక్షురాలిగా పెంటపాటి రుక్మిణి నియామకం  దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయనగరం జిల్లా  అధ్యక్షురాలిగా ప్రముఖ న్యాయవాది పెంటపాటి రుక్మిణిని   నియమించినట్లు జాతీయ చైర్మన్ బి వెంకటేశ్వర్ రాజు తెలియచేసారు,సీనియర్ న్యాయవాది అయిన రుక్మిణి గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు బాధిత మహిళలకు సంబంధించిన కేసులలో ఒక న్యాయవాదిగా వారికి సలహా సహకారాలు అందించడం జరిగిందని వెంకటేశ్వరరాజు అన్నారు,ఇకపై విజయనగరం జిల్లాలో ఎలాంటి మహిళా సమస్యలు ఉన్న వెంటనే స్పందించి వారికి తగు న్యాయం చేయాలని సూచించారు, నూతన అద్యక్షురాలు రుక్మిణి మాట్లాడుతు.. తనపై పూర్తి నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు చైర్మన్ గారికి మరియు జాతీయ ఉపాద్యక్షురాలు కళ్యాణి గారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు , జిల్లాలో  బాదిత మహిళలకి అందడండగా వుంటూ  వారి సమస్యలపై నిరంతరo   పోరాడుతానాని అన్నారు జిల్లాలో అన్నీ నియోజక వర్గాల్లో మరియూ అన్నీ మండలాల్లో కమిటీలు నియమిస్తున్నట్లు ఆమె చెప్పారు

ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ తెలుగు మ‌హిళా సంఘం ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు

Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ముఖ్య‌మంత్రి చంద్రబాబు లక్ష్యం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేని జాన‌కీ ల‌క్ష్మి ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ తెలుగు మ‌హిళా సంఘం ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు మ‌హిళ‌లంద‌రికి ఎంట‌ర్ ప్రెన్యుర్ గా  నారా భువ‌నేశ్వ‌రి ఆద‌ర్శం కేశినేని జాన‌కీ ల‌క్ష్మి ను ఘ‌నంగా స‌న్మానించిన తెలుగు మ‌హిళ‌లు   విజ‌య‌వాడ :  మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాయి.ప్రతి కుటుంబంలో ఒకర్ని ఎంటర్ ప్రెన్యూర్ గా తయారు చేయాలనే ఆశయం తో సీఎం చంద్రబాబు నాయుడు  కృషి చేస్తున్నారు.  ముఖ్యంగా మహిళలు ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారి ఆర్థిక స్వాలంబన సాధించాలనుకుంటున్నారు. అందుకే మహిళలను ప్రోత్సహించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎమ్.ఎస్.ఎమ్.ఈ  రంగంలో (Micro, Small and Medium Enterprises-సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు)  లోన్స్ తీసుకునే మహిళలకు 45 శాతం సబ్సీడీ అందిస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేన...

జై భీం సినిమా తరహాలో పోలీసు లాకప్ డెత్....

Image
 జై భీం సినిమా తరహాలో పోలీసు లాకప్ డెత్.... రెల్లి యువకుడు బంగారు యశ్వంత్ బాబు హత్య పై సమగ్ర విచారణ జరిపి ముద్దాయిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి...   యశ్వంత్ తల్లీ కుటుంబ సభ్యులను పరామర్శించిన కెవిపియస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఏలూరు జిల్లా కార్యదర్శి అందెగుల ప్రాన్సిస్, నాయకులు మంచల ఇస్కాక్ తదితరులు        ఏలూరు నగరంలో తంగేళ్ల ముడికి చెందిన రెల్లి యువకుడు బంగారు యశ్వంత్ ద్విచక్ర వాహనం దొంగిలించాడని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి చిత్రహింసలకు గురి చేసినందువల్లే మరణించాడని ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్య అని దీనిపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు.        పోలీసుల లాఠీ దెబ్బలకు చనిపోయిన తరువాత కాలువలో పడవేసి పోలీసులు కట్టుకధలు అల్లుతున్నారని, తల్లీదండ్రులను భయపెట్టి పోస్ట్ మార్టం చెయించడమే కాకుండా శవాన్ని కాల్చివేశారన్నారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని చెబుతున్...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Image
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ సూచన మేరకు ఘనంగా జరిగాయి*..  *వేడుకలలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ,జిల్లా మహిళ అధ్యక్షురాలు విజిత,స్టేట్ జనరల్ సెక్రటరీ స్వప్న,కార్పొరేటర్లు నిర్మలకుమారి,ప్రవల్ల్లిక,రహేనా మరయు  మహిళా నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు కేకు కట్ చేసి జోహార్ వైయస్సార్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు*..  *మేయర్ రాయన బాగ్యలక్ష్మి కామెంట్స్*  వైసిపి హయాంలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే వారిని నేడు ఆ పరిస్థితి లేదన్నారు..  మహిళలను ప్రోత్సహిస్తూ అనేక పథకాలు జగన్ అమలు చేశారని చెప్పారు.. ప్రతి మహిళా లక్షాధికారి అవ్వాలి అనే వైయస్సార్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకు వెళ్లారని తెలియజేశారు..  మహిళలు విద్యావంతురాలు అవ్వాలని విద్యలో కూడా ముందుండాలనే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు.. మహి...

ఆకేపాటిని విమర్శ చేసే స్థాయి నీది కాదు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి

Image
 ఆకేపాటిని విమర్శ చేసే స్థాయి నీది కాదు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి      సుండుపల్లి -  న్యూస్ 9 రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ని విమర్శ చేసే స్థాయి టీడీపీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి కి లేదని అన్నమయ్య జిల్లా రైతు విభాగం వై కా పా అధ్యక్షులు ఆరం రెడ్డి,సుండుపల్లి కన్వీనర్ రామస్వామి రెడ్డి అన్నారు.ఇటీవల కాలంలో రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,జగన్ మోహన్ రెడ్డిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న మేడా బాబు తన గతం ఏంటో చూసుకోవాలని వారు విమర్శించారు.సుండుపల్లిని పూర్తిగా సర్వనాశనం చేసి,అనేక అక్రమాలు చేసిన మేడా విజయ్ నేడు మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది అని వారు అన్నారు.ఇంకోసారి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు అన్నారు. ఇకనైనా మంచి రాజకీయం చెయ్యాలని ఇంతటి కూటమి సునామి లో సైతం రాజంపేట లో గెలిచిన చరిత్ర ఉన్న అమర్నాథ్ రెడ్డి ని మిథున్ రెడ్డి ని విమర్శలు చెయ్యడం మానుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రెడ్డి భాస్కర్. జ...

రాష్ట్రంలో విపరీతంగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించి.. ప్రజలపై మోయలేని భారాన్ని నిలుపుదల చేయాలని

Image
 రాష్ట్రంలో విపరీతంగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించి.. ప్రజలపై మోయలేని  భారాన్ని నిలుపుదల చేయాలని దళిత బహుజన పార్టీ డి బి పి వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ చేశారు. ఈ మేరకు   పాయకరావుపేటలో మీడియా వర్కింగ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీల గృహవాసాలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని కృష్ణ స్వరూప్ తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు నేటికీ ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం సరైనది కాదన్నారు. దళిత వడల సామాజిక ఆర్థిక. ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తక్షణ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత వార్షిక బడ్జెట్లో ఖర్చు చేయని నిధులను ఈ వార్షిక బడ్జెట్ నిధులలో సబ్ ప్లాన్ నిధులలో వారి అభివృద్ధి కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని గత ప్రభుత్వ హయాంలో రద్దు అయిన 27 దళితుల సంక్షేమ పథకాలన...

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి* బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు యస్.వి. రమణ గౌడ్

Image
 **మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి* బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు యస్.వి. రమణ గౌడ్   అన్నమయ్య జిల్లా సుండుపల్లి  మండలంలోని చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీలో బిజెపి సుండిపల్లి మండల అధ్యక్షులు యస్.వి. రమణ గౌడ ఆధ్వర్యంలో గ్రామ పరిధిలోని మహిళలతో మహిళా దినోత్సవ వారోత్సవ ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా బీజేపీ సుండుపల్లి మండల అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలు చదువుతోపాటు, అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని సూచించారు... చాలామంది మహిళలు  మగవారితో పాటు  అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారన్నారు. మన దేశ ప్రధాని భేటీ పడవో భేటీ బాచోవో చాలా మంచి కార్యక్రమం పెట్టడం వలన మహిళలకు ఇంకా అన్నిరంగాలల్లో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని తెలియజేశారు. డ్వాక్రా సంఘాల ద్వారా కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు మహిళలకు రుణాలు అందించడమే కాకుండా  ఉపాధిని కూడా కల్పిస్తున్నాడని అన్నారు...ప్రతి మహిళ డ్వాక్రా సంఘం లో సభ్యురాలుగా చేరాలని కోరారు. గ్రామ పంచాయితీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం  రేపు( మార్చి 08) న ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్...