Posts

Showing posts from August, 2026

SIR Corrctions...

Image
 ఈ రోజు సాలూరు కోటవీధి లో ఓటింగ్  వ్యక్తులు  నేమ్స్ అడ్రస్ తప్పు ఒప్పులు చేయడం జరిగింది ఈ కార్యక్రమం1వార్డు  సచివాలయం సెక్రెటరీ మనోహర్ గారుమున్సిపల్  deo గారు చిన్ని గారు దగ్గరుండి ఈ కార్యక్రమం జరిపించారు

రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 8 మంది మృతి?*

Image
 *రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 8 మంది మృతి?* చిలకలూరిపేట: పట్టణంలోని అవుట్‌రోడ్డు సెంటర్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటప్పకొండ నుండి వేలూరు గ్రామానికి బయలుదేరిన ప్రయాణికులను బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఘటనా స్థలిలోనే సుమారు 4 నుంచి 6మంది దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పదిేళ్లుగా పోరాడుతున్నాం.. మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి

Image
 పదిేళ్లుగా పోరాడుతున్నాం.. మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి విజయవాడలో బీసీ మంత్రిని కలిసిన పిరమలై కల్లర్ కులస్తులు చిలకలూరిపేట..... న్యూస్ 9 ప్రతినిధి విజయవాడ: తమ కులానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరుతూ పిరమలై కల్లర్ కులస్తుల ప్రతినిధులు విజయవాడలో బీసీ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత పదేళ్లుగా తమ సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నామని, తమ పిల్లలు, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమకు కొలత డ్యూటీ లేకపోవడంతో ఉపాధి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు మంత్రిని కోరారు. ఇప్పటికే తమ సమస్యపై పలుమార్లు మంత్రిని కలిశామని, తాజాగా ఇది ఐదోసారి కలవడం జరుగుతోందని ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈసారి తమ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో పిరమలై కల్లర్ ...

స్వర్గీయ ఎస్ జానకమ్మ గారి స్వర నివాళి

Image
 అభినవ జానకి బెల్లంకొండ భారతి చిలకలూరిపేట ......   విజయవాడలోని కౌతాపూర్ణ కళావేదికలో సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు డ్రీమ్ ఆడియో నిర్వహించిన స్వర్గీయ ఎస్ జానకమ్మ గారి స్వర నివాళి ఆకాశం ఏనాటిదో అనే శీర్షికతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖ గాయని బెల్లంకొండ భారతి కు ఘన సన్మానం అభినవ జానకి అనే బిరుదుతో సత్కరించడం జరిగింది . ఈ సందర్భంగా అనేక కళా సంస్థల అధినేతలు భారతిని పూలమాలలతో దృశ్యాలువలతో సత్కరించడం జరిగింది . సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ అధినేత బి.ఆర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాలలో 50 సాంస్కృతిక కళా సంస్థలు నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పాటల పోటీలలో ప్రథమ స్థానాలు పొందిన గాయని బెల్లంకొండ భారతీయని కొనియాడారు డ్రీమ్ ఆడియో అధినేత చావా నరసింహారావు మాట్లాడుతూ జానకమ్మ గారి స్వరంతో అంతే స్థాయిలో నీ లీల పాడెద దేవా, ఆకాశం ఏనాటిదో, గున్నమామిడి కొమ్మమీద, ఇది ప్రియ నర్తన హేళ, వెన్నెల్లో గోదావరి, పాటలను అద్భుతంగా ఆలపించిన బెల్లంకొండ భారతి అభినవ జానకిగా బిడ్డతో సత్కరించడం జరిగింది. సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ జానకమ్మ గారి చ...

వినియోగదారుల హక్కుల పరిరక్షణలో సేవ చేస్తున్న వారికి గుర్తింపు ఎక్కడ?

Image
 అవినీతికి అందలం.. సమాజ సేవకులకు దక్కని పురస్కారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోఆగస్టు 15 వేడుకల్లో పురస్కారాల ఎంపికపై విమర్శలు జీతాలు తీసుకునే అధికారులకు సన్మానాలు.. స్వచ్ఛంద సేవకులకు గుర్తింపు కరవు పౌరసరఫరాల శాఖ మంత్రిచే అవార్డుల బహూకరణ.. అదే శాఖకు ఉత్తమ అధికారుల కొరతపై చర్చ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో సేవ చేస్తున్న వారికి గుర్తింపు ఎక్కడ? ఎంపిక ప్రక్రియపై ఉన్నతాధికారులు సమీక్షించాలంటున్న ప్రజా సంఘాలు ఆర్టీఐ ఆక్టివిస్ట్ కుమార్ విమర్శలు నరసరావుపేట, ఆగస్టు 15.... 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవా పురస్కారాల ఎంపిక, పంపిణీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నెలనెలా జీతాలు పొందుతున్న కొంతమంది అధికారులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్, గౌరవ పురస్కారాలు అందజేయగా.. ఎలాంటి గౌరవ వేతనం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం సేవ చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు కనీస గుర్తింపు కూడా దక్కలేదని  ఆర్టీఐ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ కుమార్ తో సహా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స...

ఆటోనగర్ ఐలా ఎన్నికల్లో చైర్మన్గా గెలిచిన శివ నాగేశ్వరరావు

Image
 *విజయవాడ ఎన్టీఆర్ జిల్లా *ఆటోనగర్ ఐలా ఎన్నికల్లో చైర్మన్గా గెలిచిన శివ నాగేశ్వరరావు* *శివ నాగేశ్వరరావు ఐలా ప్రెసిడెంట్,దుర్గాప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్* ఈరోజు జరిగిన ఐలా ఎన్నికల్లో  నేను వైస్ చైర్మన్ గెలవడం జరిగింది  ప్రతి ఓటరు  నన్ను ఎంత అభిమానిస్తారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి  నాకు మూడుసార్లు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఓటరు ప్రత్యేకమైన ధన్యవాదాలు  ఈ ఫ్లాట్ ఓటర్లు ఎంతో విజ్ఞత కలిగిన ఓటర్లు ఎందుకంటే వీళ్లు ఓటుకి 1500 రూపాయలు కట్టి మరి ఓటు వేయాలి  మా అపోజిషన్ వాళ్లు తప్పుడు ప్రచారం చేసిన మేము గెలిచాము  కోటి 30 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకు కట్టడం జరిగింది దానిలో  ఆర్వో కూడా పెట్టాం  ప్రధాన కూడళ్లలో మంచినీటి సౌకర్యం అందరికీ కల్పిస్తాము  ఆటోనగర్లో చెత్త బాగా పేరుకు పోయింది  ఆ చెత్తను తొలగించడానికి పట్టాభి, బోడే ప్రసాద్, బోండా ఉమా తో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో మాట్లాడడం జరిగింది  ఇప్పటికే 350 టన్నుల చెత్తను పట్టాభి  తొలగించడం జరిగింది  ఆటోనగర్లో డ్రైనేజీలు అన్నిటిని కొత్త టెక్నాలజీతో...

అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడే 'సీపీఆర్' (కార్డియో పల్మనరీ రిససిటేషన్)

Image
*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ* *సీపీఆర్ అవేర్‌నెస్ కార్య‌క్ర‌మం లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్ట‌ర్ లక్ష్మీ *ప్రాణం కాపాడటమే పరమావధి!* అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడే 'సీపీఆర్' (కార్డియో పల్మనరీ రిససిటేషన్)  విధానంపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంచడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ.  గ్రో రైట్స్ (Grow Rights), శ్వాస (Sswaasa), ఫ్యూచర్ రూట్స్ (Future Roots) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక హర్ష వాస్కులర్ సెంటర్ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా సీపీఆర్ అవగాహన సదస్సును నిర్వహించారు.  *కలెక్టర్ లక్ష్మీశ  కామెంట్స్*  గుండెపోటు లేదా ఊపిరి ఆగిపోయిన అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్సగా అందించే సీపీఆర్ ఒకరి అమూల్యమైన ప్రాణాన్ని కాపాడగలాదూ   ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యులు వచ్చేలోపు చేసే ఈ చిన్న ప్రక్రియ ఎంతోమందిని బ్రతికిస్తుంది  ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థులకు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి  ప్రతి ఒక్కరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలని అలాగే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది  ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని...