Skip to main content

Posts

Showing posts from October, 2024

యువత, విద్యార్థులు ఉద్యమాల ద్వారా ఈ దేశ గతిని మార్చగలరు.....

 చిలకలూరిపేట టౌన్, న్యూస్ 9 రిపోర్టర యువత, విద్యార్థులు ఉద్యమాల ద్వారా ఈ దేశ గతిని మార్చగలరు.....  ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ విద్యార్థి సమావేశంలో సిపిఐ నాయకులు  ఆ రాధ్యుల రామకృష్ణ

నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా*

 *నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా* *రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు శస్త్ర చికిత్సలు..* *వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కూలీకి అరచేతి పక్షవాతం..  రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశం* *ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు జింకా రెడ్డి శేఖర్ తీర్పు* **** వైద్యుల నిర్లక్ష్యంపై శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి *జింకా రెడ్డి శేఖర్* తీర్పు ఇచ్చారు. ఓ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించి అరచేతి పక్షవాతానికి కారణమైనట్లు నిర్ధారించి.. బాధితుడికి రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలంటూ నెల్లూరు నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. *వివరాల్లోకి వెళితే..*  నెల్లూరు కొడవలూరుకు చెందిన షేక్ మక్సూద్ భవన నిర్మాణ కూలిగా జీవనం సాగించేవాడు. 2009 నవంబరు 28న పని చేస్తుండగా కింద పడటంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన తరువాత ఓ వైద్యుడు శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించగా.. డిసెంబర్ 1న లాంగ్ బోన్ ఫ్రాక్చర్ కు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 2009 డిసెంబర్ 12న డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ తరువాత విపరీతమైన చ...

సుప్రీం కోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహం..చీర కట్టు, చేతిలో రాజ్యాంగం..కళ్ళకు గంతలు తీసేశారు.🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణసమితి🇮🇳

 సుప్రీం కోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహం..చీర కట్టు, చేతిలో రాజ్యాంగం..కళ్ళకు గంతలు తీసేశారు.🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణసమితి. CRPFI. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ దాసరి సురేష్. PR. 9133366449🇮🇳

ఆర్టీసీ ఈడి గిడుగు వెంకటేశ్వర్లు గారు చిలకలూరిపేట ఆర్టీసీ డిపో లో నెలకొన్న సమస్యలపై ఆకస్మిక పర్యటన కార్యాచరణ రూపొందితేనే విజయవంతం..

 ఆర్టీసీ ఈడి  గిడుగు వెంకటేశ్వర్లు గారు చిలకలూరిపేట ఆర్టీసీ డిపో లో నెలకొన్న సమస్యలపై  ఆకస్మిక పర్యటన  కార్యాచరణ రూపొందితేనే విజయవంతం.. మురికిపూడి ప్రసాద్  వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం  పల్నాడు జిల్లా ఇన్చార్జ్... ఆర్టీసీ ఈ డి గిడుగు వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రయాణికులు తో కలిసి బస్టాండ్ లో నెలకొన్న కొన్ని సమస్యలను తెలుసుకున్నట్టుగా మీడియాలో రావడం జరిగింది.. అయితే బస్టాండ్ లో కొద్దిపాటి వర్షానికి బస్టాండ్ అంతా కూడా బురద పేరుకుపోయి ప్రయాణికులు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్ లో asist వారిచ్చిన వాటర్ ప్లాంట్ అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుందని తెలుస్తుంది.. బస్టాండ్ లో ఆదాయం కోసం విచ్చలవిడిగా పలు మోటార్ సైకిల్ స్టాండ్లు ఇచ్చారు.. ఏ స్టాండ్ లో కూడా డబ్బు చెల్లించే వినియోగదారుడికి న్యాయం జరగదు. కారణం వాళ్లు  మోటార్ సైకిల్ స్టాండ్ కు సంబంధించిన ఏనామ్స్ వారు పాటించడం లేదు.. ఇక కార్గోలు చెప్పే పనేలేదు.. పార్సిల్ ఇచ్చిన ,తీసుకున్న పై డబ్బులు ఇవ్వాల్సిందే.. హమాలీలు చెప్పిన కూలి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.  బస్టాండ్ వెనుక ...

ప్రభుత్వ స్థలాలను. చెరువులను కబ్జాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి...

 🚩ప్రభుత్వ స్థలాలను. చెరువులను కబ్జాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి....🚩 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ .......................... *పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపైన. ప్రభుత్వ చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో గ్రావెల్ ను తరలిస్తున్న వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని. సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. శనివారం బొబ్బిలి ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూకబ్జాలపై న మండల తహసీల్దార్  (MRO)M శ్రీను గారికి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ. నిన్న మిలటరీ కాలనీ పక్కన ఉన్నటువంటి చెరువునుకబ్జా చేసినటువంటి.BSR ప్రాపర్టీస్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో పత్రికా ముఖంగా తెలియజేయాలని. బి ఎస్ ఆర్ ప్రాపర్టీస్  యాజమాన్యం వేసిన వెంచర్ల లో  చాలా అవకతవకులు ఉన్నాయి వీటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగేప్రభుత్వ చెరువుల్లో గ్రావెల్ ను తరలించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి  కఠినమైన చర్యలు తీసుకోవాలని. . కోటి చెరువు...

గుర్లలో జరిగిన ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే స్థానిక ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఇవ్వాలి-లోక్ సత్తా!!!

 26-10-2024 గుర్లలో జరిగిన ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే స్థానిక ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఇవ్వాలి-లోక్ సత్తా!!! ***************************               ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ప్రబలిన డయేరియాతో రాష్ట్రం అంతా ఒక్క సారి ఉలికి పడింది. దీనికి ముఖ్య కారణం అక్కడ స్థానిక ప్రభుత్వం ప్రజా రోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని అందుకే స్థానిక ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఇచ్చి రాజకీయ ప్రమేయం లేకుండా చేయవలసిన అవసరం ఉందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి సూచనలు గమనిస్తే ఆ గ్రామంలో త్రాగు నీరు, పారిశుధ్యం, మురుగు నీటి వ్యవస్థ, మంచి నీళ్ల ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, బహిరంగ మల విసర్జన లేకుండా చూడడం, పైపు లైన్ల అమరిక, ఇవేవీ సరిగ్గా లేవు. ఆ గ్రామంలో ఈ పనులన్నీ చెయ్యవలసింది అక్కడి స్థానిక ప్రభుత్వం, అంటే ఆ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి నిధులు,...

శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో

 శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా విశేష పూజలు పట్టణంలోని  శ్రీ వాసవి జ్ఞాన మందిరంలో గురువారం  శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ్ అధ్యక్షులు కొత్త కోటేశ్వరావుతో పాటు కార్యదర్శి కొప్పురావురి కుమార్, కోశాధికారి గ్రంథి సుబ్బారావు,  సహాయ కార్యదర్శి పొట్టి శ్రీనివాసరావు,  చిలకల రామ లింగేశ్వర రావు, కొప్పురావూరి నాగేశ్వరావు,పటేల్, ధామిసెట్టి నాగేంద్ర, పసుమర్తి సూర్యం, చెవూరు కృష్ణమూర్తి, కనమర్ల పూడి రమేష్, రాచమల్లు సూర్యారావు,  తవ్వ నాగమలేశ్వరరావు, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రెవిన్యూ కళ్యాణమండపం లొ విజయనగరం డిఫెన్స్ మరియు పోలీస్ అకాడమీ డైరెక్టర్ డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అకాడమీ లో ఉన్న 150 మంది విద్యార్థి విద్యార్థినిలు మరియు ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంకు వారి సహకారం తో ఉచిత రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అదితిగా విజయనగరం శాసన సభా సభ్యులు ఐన శ్రీ అదితి గజపతి రాజు గారు విశిష్ట అధితులుగా లోకసత్తా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిసెట్టి బాబ్జీ గారు  జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి మజ్జి కృష్ణా రావు గారు  పోలీస్ ట్రైనింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ అప్పారావు గారు  వన్ టౌన్ సీఐ శ్రీ శ్రీనివావాస్ గారు  టీడీపీ నాయకులు శ్రీ అవనాపు విజయ్ గారు పాల్గొన్నారు  అధితులు అందరూ మాట్లాడుతూ విజయనగర డిఫెన్స్ మరియు పోలీస్ అకాడెమీ చేస్తున్న సేవలను కొనియాడారు  అలాగే రక్త దానం యొక్క ఆవశ్యకతను తెలిపారు  విద్యార్థులందరు స్వచ్ఛందంగా శిబిరం లో పాల్గొని 67 యూనిట్స్ బ్లడ్ ని దానం చేశారు  అకాడమీ నుంచి ఆర్మీ ర్యాలీ లో ఉద్యోగం పొందిన 14 మంది విద్యార్థులకి వాళ్ళ తల్లి తండ్రులకు చి...

సంవత్సరం అమ్మ ఒడి తాలూకా డబ్బులు విద్యాసంవత్సరం పూర్తయిపోయి 2023 వచ్చిన ఇప్పటివరకు తల్లుల ఖాతాలో డబ్బులు చేరలేదని

 ఖాతాలో పడని పాత బకాయిలు.... స్థానిక యాదవ్ వీధి జంక్షన్ వద్ద నిర్వహించిన పత్రిక మిత్రులు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ గత20 22 విద్యా సంవత్సరం  అమ్మ ఒడి తాలూకా డబ్బులు విద్యాసంవత్సరం పూర్తయిపోయి 2023 వచ్చిన ఇప్పటివరకు తల్లుల ఖాతాలో డబ్బులు చేరలేదని దీనివల్ల పాఠశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని ఫీజులు చెల్లించని ఎడల యాజమాన్యాలు విద్యార్థుల్ని తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి కావున పాత బకాయిల్ని తక్షణమే తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాలని అలాగే 2023-2024 విద్యా సంవత్సరం నూతన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం తాలూకా పూర్తి సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులకు లేదని అలాగే విద్యా సంవత్సరం చివరికి వస్తున్న కూడా ఎప్పటికీ తల్లికి వందనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విదమైన చర్యలు లేవని తక్షణమే విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్ పండు తేజ తదితరులు పాల్గొన్నారు

బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం విప్లవ శక్తిని సృష్టించిన పిడిఎస్ యూ

*బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం విప్లవ శక్తిని సృష్టించిన పిడిఎస్ యూ* *1974 అక్టోబర్ నుండి 2024 అక్టోబర్  అర్థ శతాబ్దొస్తవ PDSU సంబరాలు పోస్టల్ ఆవిష్కరణ*                    రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 సంవత్సరాల అర్థ శతాబ్దొస్తవ సభలను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర మరియు కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం ఉపాధ్యాయుల నాగేశ్వర బాబు మరియు సుజాత ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.                  ఈ సందర్భంగా నాగేశ్వర మాట్లాడుతూ 1974 అక్టోబర్ 12 తేదీలో  పిడిఎస్యు మొదటి మహాసభ హైదరాబాద్ నగరంలో నిర్వహించుకొని సరిగ్గా నేటికీ 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఈ క్రమంలోనే అక్టోబర్ 24తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో దాదాపు 11 రాష్ట్రాలతో కలిసి సభలు నిర్వహించుకుంటుందని తెలియజేశారు.        ...

పైపుల నుంచి లీకేజీ

  పట్టణంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్  వెనుక వైపు, మరియు చౌత్రా సెంటర్ డాక్టర్ ఆర్ వి సుబ్రహ్మణ్యం గారి ఇంటిముందు మంచినీటి పైపుల నుంచి లీకేజీ ఉన్నది.. కమిషనర్ గారు, డి ఈ గారు పరిశీలించి వెంటనే లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు సార్🙏🙏🙏🙏🙏

గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

 చిలకలూరిపేటటౌన్, న్యూస్ 9 రిపోర్టర్ - గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి నెలలోజరుగుతున్నాయని, " ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం " వ్యవస్థాపకులు షేక్.జాఫర్ అన్నారు.  సోమవారం ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఉద్దేశించి  ఓటు మీద అవగాహన కల్పించారు. ప్రవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఓట్లు నమోదు వేగవంతం చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులు,  ప్రైవేటు సంస్థలలో పని చేసే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో తొలుత ఓటు నమోదు చేసిన వారికే, ఓటు అడిగే హక్కు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఉపాధ్యాయులు  చుండి.శివప్రసాద్, షేక్. హసీనా, అంజయ్య, ఆల్ బీన్, లాల్బి, ఆదినారాయణ,  సక్రు నాయక్ తదితర ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిరు ఉద్యోగుల కడుపు కొట్టొద్దండి

 చిరు ఉద్యోగుల కడుపు కొట్టొద్దండి   *ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీ నిలబెట్టుకొని వాలoట్రీలను  కొనసాగించాలి*  *ఎన్నికల హామీ ప్రకారం పదివేల రూపాయల గౌరవేతనం ఇవ్వాలి* 4 నెలల బకాయిలు చెల్లించాలి  *రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంట్రీలను కొనసాగించాలి*  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ మరియు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు  సోమవారం నాడు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ వద్దకు మొదటగా ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు అనంతరం  కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా.. సిపిఐ జిల్లా కార్యదర్శి పి ఎల్ నరసింహులు, వాలంటీర్లు అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు పి మహేష్ అధ్యక్షులు నరసింహులు, అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు తపాయి వెంకటేష్  లు మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాల కాలము నుండి వాలంటీర్లు కేవలం 5000 రూపాయల జీతంతో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు చేసిన సేవ వర్ణించలేనిద...

విజయనగరంలో వాలంటర్ల నిరసన

*విజయనగరంలో వాలంటర్ల నిరసన* గ్రామ సచివాలయ వాలంటరీలను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం(అక్టోబర్ 21) విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.  ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీలను కొనసాగించకపోవడం అన్యాయమన్నారు. గ్రామాల్లో వాలంటరీలు ప్రజలకు చేరువుగా ఉండి మంచి సేవలు అందించారని తెలిపారు. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఫాస్ట్ న్యూస్

నేడు తిరుపతి జిల్లాలో సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

 

రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం

 *ఏలూరు సిటీ,* *రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం,* *డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ 50,000 డిమాండ్,* *50,000 ఇస్తే లేదా చావు నాకేంటి అంటూ అవహేళన*  *ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  పొందుతున్న జన్యావుల సుధాకర్ (నాని),*  ఇక వివరాల్లోకొస్తే స్థానిక ఏలూరు పట్టణానికి చెందిన జన్యావుల సుధాకర్(నాని)అనే వ్యక్తి పినకడిమి గ్రామంలో 13 బస్తాలు *ఆరున్నర* క్వింటాల్ బియ్యం కొనుగోలు చేస్తుండగా డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ అక్కడికి చేరి  తనకు 50 వేలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు, 50,000 ఇస్తే కేసు ఉండదని , లేకపోతే నీ చావు నువ్వు చావని  అసభ్యకరంగా మాట్లాడడం వలన తాను మనస్థాపన చెందానని ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని  దానికి పూర్తి కారణం డిప్యూటీ తాసిల్దార్ ప్రమోదనని, ఆ బస్తాలకు నా వ్యాన్కు ఎటువంటి సంబంధం లేకపోయిన కానీ కావాలని ఆ బస్తాలు నా వ్యాన్లో ఎక్కించి అన్యాయంగా కేసు నమోదు చేసారని తెలిపారు, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తగిన విచారణ చేసి న్యాయం చేయాలని జన్యావుల సుధాకర్ (నాని) కోరారు.

ప్రముఖ అపాచీ షూ కంపెనీలో దారుణ హత్య

 తిరుపతి జిల్లా తడ మండలం  బ్రేకింగ్ న్యూస్... ప్రముఖ అపాచీ షూ కంపెనీలో దారుణ హత్య  తిరుపతి జిల్లా తడ మండలంలో మాంబట్టు లోని ప్రముఖ అపాచీ షూ కంపెనీ తయారీ సంస్థ లో దారుణ హత్య చోటుచేసుకుంది కంపెనీలో పనిచేస్తున్న ఓ వివాహితను దారుణ హత్య చేశాడు  వివరాల్లోకెళితే... మృతురాలిది దొరవారిసత్రం మండలం కుమ్మరిపాలెం గ్రామం దళితవాడ ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రబోతు వనజ ..27 సంవత్సరాలు వెంకటాద్రి 31 సంవత్సరం గత అపాచీ కంపెనీలో 11 సంవత్సరాల నుంచి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పనిచేసుకుంటూ కేవలం సాగిస్తున్నారు ఈలోగా మృతురాలికి శాపంగా మారిన అదే గ్రామానికి చెందిన డీప్ ప్లాంట్లో మెయిన్ జూరు సురేష్ అనే యువకుడు 23 సంవత్సరాలు గత కొంతకాలంగా మూడు సంవత్సరాల నుండి ఎర్రబోతు వనజాను లైంగికంగా వేధిస్తున్నాడు మరియు గత ఎన్నోసార్లు తడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగినది కేసు కూడా జరుగుతున్నది ఈలోగా వనజ మృత్యువాత పడింది ముద్దాయి కోసం తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండప్ప నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన

 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల ఎంపీడీఓ  సుధాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ గారు టి.సుండుపల్లి మండలం ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసంక్షేమ గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీ లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ఎన్డియే కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవనియులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, బీజేపీ మండల అధ్యక్షులు నాగరాజ,ఉపాధ్యక్షులు వెంకటరమణ నాయుడు, తెలుగుదేశం మండల ఉపాధ్యక్షులు యర్రంరెడ్డి,మైనార్టీ నేత మేకల మహబూబ్ భాష, రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి దామోదర్ నాయుడు, యస్ టి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ నాయక్, రాజంపేట పార్లమెంట్ యస్ టి సెల్ ఉపాధ్య...

పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ

 చిలకలూరిపేట , టౌన్ న్యూస్9 రిపోర్టర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ చేసి  మంగళ వారం చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ గారు అయిన శ్రీ P. రమేష్   సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. కాగా అర్బన్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సెల్ఫోన్ రికవరీలను రమేష్ బాబు వేగవంతం చేసి బాధితులకు అప్పగించడంతో.  పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

దళితులకు సంబంధించిన స్మశాన వాటికను తీసివేసి ఆ వంక పరం పోగు స్థలములో రోడ్లకి మరియు భవనాలకి అనుమతి?

 ** దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మండల రెవెన్యూ అధికారి** - రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న మండల రెవెన్యూ అధికారి?     దళితులకు సంబంధించిన స్మశాన వాటికను తీసివేసి ఆ వంక పరం పోగు స్థలములో రోడ్లకి మరియు భవనాలకి అనుమతి?  అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం అక్టోబర్ 3   సుండుపల్లి మండలం కేంద్రానికి కూత వేటు  దూరంలో ఉన్న సర్వే నంబర్ 2067-1 మొత్తం జాక రెండు ఎకరాల 20 సెంట్లు కాగా ఈ యొక్క స్థలాన్ని గుల్ల వాండ్లపల్లి కి చెందిన గ్రామస్తులు ఎప్పటి నుంచో స్మశాన వాటిక వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్మశాన వాటిక స్థలములో కొందరు భవనాలు నిర్మించారు. అప్పటికి అధికారులు ఎవరు చొరవ  చూపి పట్టించుకోకపోగా   మిగిలిన గౌరీలు ఉన్న స్థలమును గోరీలను  తొలగించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తను వెంచర్ కోసం అక్రమంగా స్మశాన వాటిక ఉన్న స్థలంలో  రోడ్లు నిర్మిస్తుంటే గ్రామస్తులు అందరూ వెళ్లి ఎమ్మార్వో గారిని గత మంగళవారం కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి స్పందన రాకపోవడంతో మళ్లీ ఈరోజు ఎమ్మార్వో దగ్గరికి వెళ్లి వివరణ అడగగా గ్రామస్తులు మీకు ఎటు...

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-

  గౌరవ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గాజువాక నియోజకవర్గం ఈ రోజు అనగా 03.10.2024 న ఎక్స్ పారామిలిటరీ ఆర్మీడ్ ఫోర్స్ ( CAPF) సభ్యులు కలవడం జరిగింది Ex CAPF జవాన్లు లకు కార్యాలయం నకు స్దలము మరియు కార్పొరేషన్ లో మా CAPF జవాన్లులకు చేర్పించండి అని భారత్ సరిహద్దు లో మా జవాన్లు ఎక్కువ చనిపోయారు / చనిపోతున్నారు / వారికి ఆదుకోండి రిటైర్మెంట్ అయ్యిన వారు / సర్వీసు వారి కుటుంబసభ్యులకు కు మేలుచెయ్యండి వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున  Rs. 25,000/- ఇరవై ఐదు వేలు రూపాయిలు) ఇవ్వడము హాజరిగింది   V హరినాథ్, స్టేట్ ప్రెసిడెంట్  G S B సుబ్రహ్మణ్యం, స్టేట్ సెక్రటరీ K రామారావు, ప్రెసిడెంట్ A హరిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ G S V S రామకృష్ణ S U భాస్కర్ K సంజీవ A  రాంబాబు Y V కుమార్ అనపర్తి అప్పారావు K R బాబు మళ్ల శ్రీనివాసరావు G బాబురావు డోనార్స్  🌷🙏🙏👮‍♂️🌹👮‍♂️🙏🙏🌷    *విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్, విశాఖపట్నం & అనకాపల్లి మన సభ్యులు తరపున...

బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి కౌన్సిలర్ దంపతులు

బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి కౌన్సిలర్ దంపతులు చిలకలూరిపేట టౌన్ న్యూస్ 9 రిపోర్టర్ రవి నాయక్ పట్టణంలోని చొత్ర సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరం లో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి గురువారం టిడిపి కౌన్సిలర్ దంపతులు కొత్త కోటేశ్వరరావు, కొత్త కుమారి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ధర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు...

జాతిపిత మహాత్మాగాంధీ 155 వ జయంతి సందర్భన్ని పురస్కరించుకొని

 జాతిపిత మహాత్మాగాంధీ 155 వ జయంతి సందర్భన్ని పురస్కరించుకొని ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి పూలమాలలతో  ఆలంకరించి ఘననివాళులు అర్పించినట్లు గాంధీ క్లబ్స్ క్లబ్స్ చైర్మన్ ఘంటసాల బంగారుబాబు తెలియజేసారు.. అనంతరం గాంధీ జయంతి సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సి ఆర్ కాలేజ్ పూర్వ ప్రిన్సిపల్, వెంకట నారాయణ మహాత్ముని గొప్పతనాన్ని వివరిస్తూ నేటియువత మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం మరో ముఖ్యఅతిధి నవతరం పార్టీ జాతీయ అధ్యక్ష్యులు రావు సుబ్రహ్మణ్యం మహాత్మాగాంధీ త్యాగనిరతిని స్లాగిస్తూ చిలకలూరిపేట పట్టణం లోని చీరాల రోడ్డు కు గాంధీ మార్గ్ గా నామకరణం చేయాలని సభలో ప్రతిపాదన చేయగా సభ ముక్తకoటంతో ఆమోడించింది. తదుపరి సనాతనధర్మ పరిరక్షకునిగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త గాంధీయన్ పొట్టి రత్నబాబు ను గట్టా హేమకుమార్,గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు ముఖ్య అతిధులచే గాంధీ సేవా పురస్కార్ తో   సత్కరించి అభినండించడం జరిగింది. గాంధీయన్ వెలoపల్లి రవిశంకర్ అధ్యక్షత వహించిన ఈ సభకు చేబ్రోలు మహేష్,రాచుమల్లు బాధరీనారాయణ మూర్తి, పానకాల రాంబాబు, ఆలపాటి పాండురంగారావ...

శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి మాతను అంగరంగ వైభవంగా మందుగొండు సామగ్రితో మేళ్ల తాళాలతో

  విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఈరోజు శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి మాతను అంగరంగ వైభవంగా మందుగొండు సామగ్రితో మేళ్ల తాళాలతో తల్లిని ప్రతిష్టించడం జరిగింది. ఈ తల్లికి వెండి కిరీటాన్ని 40 సంవత్సరముల కిందట ఆడారి అప్పారావు సమర్పించారు అది కొంత క్షీణించడంతో మరల కొత్తది వారి కుమారులు ఆడారి రమేష్ ఆడారి దత్తు వారి కుటుంబీకుడు ఈరోజు ఆ యొక్క తల్లికి కిరీటాని సమర్పించారు ఈ కార్యక్రమంలో దుర్గాదేవి కమిటీ సభ్యులు  భవాని మాతలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

155 వ గాంధీ జయంతి సందర్భంగా ...

  అన్నమయ్య జిల్లా చిన్నమండెం  మండల కేంద్రంలో 155 వ గాంధీ జయంతి సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ చిన్నమండెం మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలం గా గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మనం తినే పండ్లకు కూడా ప్లాస్టిక్ ను వినియోగించి మనకు అమ్ముతున్నారని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను. ప్లాస్టిక్ కవర్లు గాని ప్లాస్టిక్ సంచులు గాని ప్లాస్టిక్ అనబడే ఏ వస్తువునైనా  మన నుంచి దూరంగా ఉంచాలని. ప్లాస్టిక్ను  వాడటం వల్ల అనేక క్యాన్సర్ జబ్బులకు కారణాలు ఏర్పడతాయని. ప్లాస్టిక్ను వాడి పడేసిన తర్వాత ఒక తరం వరకు అది కులదని దానివల్ల భూమిలో రసాయనాలు వెలువడి అది క్యాన్సర్ ప్రభావాన్ని మనపై చూపిస్తుందని కాబట్టి ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ను నిషేధం చెయ్యాలని  ఎంపీడీవో  మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎంపీడీవో స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది గ్రామ ప్రజలతో ప్రారంభించడం జరిగింది సభకు హాజరైనటువంటి ఉపాధి కూలీలు ఏపీవో సచివాలయం సిబ్బంది గ్రామ సర్పంచ్ అందరూ కూడా ఈ గ్రామ సభలో పాల్గొనడం జరిగింది సర్పంచ్  మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సులు...

లా కోర్సులు చదవాలంటే క్రిమినల్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ తనిఖీ తప్పనిసరి.

 *PAAP EDUCATION NEWS*   *లా కోర్సులు చదవాలంటే క్రిమినల్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ తనిఖీ తప్పనిసరి..’*  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాద వృత్తిలో పారదర్శకత, నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో అనేక కొత్త నియంత్రణ చర్యలను తీసుకొచ్చింది. న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు (CLEs) వర్తిస్తాయని ప్రకటించింది. న్యాయ విద్య, ఉద్యోగాల్లో చేరే వారికి తప్పనిసరిగా క్రిమినల్ బ్యాగ్‌ గ్రౌండ్‌ చెక్‌ చేయాలని బీసీఐ స్పష్టం చేసింది. న్యాయవిద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మెమో, పట్టా ఇచ్చేముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, నేరచరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలనే కఠిన నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయవిద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది. లా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు నేరచరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధ్రువపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీచేసే ముందు విద్యార్థుల నేరచరిత...

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం.

  పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాము.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం. ప్రభుత్వ స్థలాలు,చెరువులు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి,అక్రమ కట్టడాల విషయంలో ఏ పార్టీ వారైనా,ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉండే పేదలకు టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాటిని కూల్చివేస్తామన్నారు..ఏ పేదవారిని ఇబ్బంది పెట్టేది లేదు.  ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ గారు స్పష్టం చేశారు.

టి ఏ రామచంద్ర ఆధ్వర్యంలో ఉపాధి చట్టం అవగాహన సదస్సు

  అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా  సూరప్ప గారి చెరువు దగ్గర కాలువలో మట్టి తీయుట ఉపాధి హక్కుదారులు చేయడం జరిగింది పని అనంతరం టి ఏ రామచంద్ర ఆధ్వర్యంలో ఉపాధి చట్టం అవగాహన సదస్సు  ఎంత పనికి ఎంత వేతనం ఇస్తారు అనేదాన్ని పై ఎంత వర్క్ చేయాలనే దానిపై పూర్తి అవగాహన ఉపాధి హక్కు దారులకు టి ఏ రామచంద్ర ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు చేయడం జరిగింది ఉపాధి హామీ అనేది మన హక్కు దీని జాబు కార్డు కలిగిన ప్రతి  ఉపాధి హక్కుదారులు  వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది100  రోజులు ఉపాధి హామీ కూలీలు వారు పని దినాలు ఇంకా 50 రోజులు అదనంగా ఉపాధి కూలీలు అడగడం జరిగింది నేను ఈ విషయాన్ని మండల మీటింగ్ లో పై అధికారుల దృష్టికి  తీసుకొని పోతా అని తెలియజేయడం జరిగింది