ప్రభుత్వ స్థలాలను. చెరువులను కబ్జాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి...

 🚩ప్రభుత్వ స్థలాలను. చెరువులను కబ్జాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి....🚩


భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్

..........................



*పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపైన. ప్రభుత్వ చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో గ్రావెల్ ను తరలిస్తున్న వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని. సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. శనివారం బొబ్బిలి ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూకబ్జాలపై న మండల తహసీల్దార్  (MRO)M శ్రీను గారికి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ. నిన్న మిలటరీ కాలనీ పక్కన ఉన్నటువంటి చెరువునుకబ్జా చేసినటువంటి.BSR ప్రాపర్టీస్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో పత్రికా ముఖంగా తెలియజేయాలని. బి ఎస్ ఆర్ ప్రాపర్టీస్  యాజమాన్యం వేసిన వెంచర్ల లో  చాలా అవకతవకులు ఉన్నాయి వీటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగేప్రభుత్వ చెరువుల్లో గ్రావెల్ ను తరలించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి  కఠినమైన చర్యలు తీసుకోవాలని. . కోటి చెరువు పూర్తి విస్తీర్ణం గుర్తించి. కోటి చెరువు.మరియు . చీపురుభంద. అమ్మి గారి కోనేరు గట్టు. బైరి సాగరం పలు ప్రభుత్వ  చెరువుగట్టుల పైన నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని. ఇందిరమ్మ కాలనీలో నకిలీ  ఇళ్ల స్థలాల పట్టాలను రద్దుచేసి. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్న వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల స్థలాలు  ఆక్రమణలు చేసి ఇల్లు నిర్మాణాలు చేపట్టి. ఆ స్థలాలను లక్షలాది రూపాయలకు అమ్ముతున్నారని ఈ వ్యవహారంపై  ఎమ్మార్వో గారు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దొంగ పట్టాలు తయారుచేసిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్న  అర్హులైన పేదలకు ఇల్లు స్థలాలు  మంజూరు చేయాలని కోరారు .  సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న పాల్గొన్నారు🚩