ప్రైవేటీకరణ వ్యతిరేక* *ప్రజా ఉద్యమ ర్యాలీలో నింగినంటిన* *నిరసన జ్వాలలు* !
*పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట లో మెడికల్ కళాశాలల* *ప్రైవేటీకరణ వ్యతిరేక* *ప్రజా ఉద్యమ ర్యాలీలో నింగినంటిన* *నిరసన జ్వాలలు* !
*ర్యాలీలో భారీగా పాల్గొన్న యువత!*
*శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో* *నింగినంటిన నీలిరంగు* *జెండా!*
*ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీతో కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన* *వైయస్సార్ కాంగ్రెస్* *పార్టీ!*
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా* *కూటమి ప్రభుత్వం 10000 కోట్ల* *స్కాంకు పాల్పడింది!*
*కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి* !
*గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం* *ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు* *అనుమతిస్తే ప్రజలు తమ* *నిరసనలతో అప్పటి* *ప్రభుత్వాన్ని కూల్చివేశారు!*
*ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలను* *ప్రజలు చీదరించుకుంటున్నారు* !
*తక్షణమే ప్రభుత్వ మెడికల్ కళాశాలల* *ప్రైవేటీకరణ నిర్ణయాన్ని* *కూటమి ప్రభుత్వం వెనక్కి* *తీసుకోవాలి _ప్రజా ఉద్యమ ర్యాలీలో పల్నాడు* *జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ* *కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి* *శ్రీనివాస్ రెడ్డి గారు*
పల్నాడు జిల్లా కేంద్రంలో నరసరావుపేట లో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మల్లమ్మ సెంటర్ మీదుగా ఆర్డిఓ ఆఫీస్ వరకు నిర్వహించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమ వ్యతిరేక ర్యాలీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ముఖ్యంగా యువత భారీగా పాల్గొని తమ నిరసనను కూటమి ప్రభుత్వానికి తెలియచేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పట్టణ వీధులు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.....
వైయస్సార్ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను 2021 _ 22లో ప్రారంభించుకోవడం జరిగింది.
జిల్లాకు ఒక ప్రభుత్వ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ,
అనేకమంది పేదవాళ్లు కరోనా కాలంలో చనిపోవడం జరిగిందనీ, ఇది చూసి చలించిన మనసున్న మనిషిగా జగనన్న గారు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందనీ, అంతలోనే ప్రభుత్వ మారడం వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారి అనుచరులకు, మరియు తమ పార్టీ వాళ్లకి కట్టబెట్టాలని చూడటం వాస్తవం కాదా! అని ప్రశ్నించారు?
ఒక్కొక్క కాలేజీని 66 సంవత్సరాల కు లీజ్ కు మరియు ఎకరానికి ₹1000 వెయ్యి రూపాయలకు టెండర్లు పిలవటం వాస్తవం కాదా ?
చంద్రబాబు నాయుడు గారు... మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా.... భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక్క మెడికల్ కళాశాలనైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిన దాఖలాలు ఉన్నాయా ?
మీకు ఛాలెంజ్ చేసి అడుగుతున్న... ఇది ఒక ఆంధ్ర ప్రదేశ్ లోనే జరిగిందన్నది నిజం కాదా?
గతంలో 14 సంవత్సరాలు నీవు ముఖ్యమంత్రి చేశావు ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు మొత్తం నీ 16 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తీసుకుని రావడం నీకు చేత అయిందా?
జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఒక దుర్మార్గపు ఆలోచనలతో ఈ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తున్నది నిజం కాదా ?
వైఎస్సార్ పార్టీ ఒక్కటే కాదు జనసేన ,తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు కూడా ఈ కళాశాలల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తున్నారు.
ఈరోజు రాష్ట్రంలో అదనంగా 2750 సీట్లు పేద విద్యార్థులకు వస్తాయి,
ఈ రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఈ కళాశాలలను తీసుకురావడం జరిగిందనీ ,
గతంలో మన రాష్ట్ర విద్యార్థులుఒక్కొక్క సీటుకి కోట్లు ఖర్చుపెట్టి చదువుకుంటున్న మాట వాస్తవం కాదా ?
మన రాష్ట్రంలో ప్రస్తుతం 6000 సీట్లు ఉన్నాయి ఇంకో రెండు వేల సీట్లు పెరుగుతాయి!
కర్ణాటకలో 8800 సీట్లు ఉన్నాయి ,
మనది పేద రాష్ట్రం 2000 సీట్లు అదనంగా వస్తే పేదవాళ్లు చదువుకోరా ? అని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం ప్రవేటీకరణ ద్వారా పదివేల కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నది వాస్తవం కాదా?
ఒక పథకం ప్రకారం మెడికల్ కళాశాలలో అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు?
1400 సీట్లు అమ్ముకుంటే ఐదు సంవత్సరాలలో పదివేల కోట్లు చంద్రబాబు మరియు లోకేష్ లకు వస్తాయి !
ఇది ఒక పెద్ద స్కాం!
ఈ నిర్ణయం వెనక్కి తీసుకుపోతే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం!
గతంలో లాగా ఈరోజు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే ప్రజలు ఊరుకోరు!
అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ప్రజా వ్యతిరేక నిరసనలతో ఆ ప్రభుత్వం కూలిపోయింది !
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేశారు!
ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి!
ఈ రాష్ట్రాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు !
విజయవాడలో 450 కోట్ల ఆర్టీసీ స్థలాన్ని అమ్మేశారు!
వైజాగ్లో 8,00కోట్ల స్థలాన్ని లులు మాల్ కి చౌకగా అమ్మేశారు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరియు రిసార్ట్ ప్రైవేటు పరం చేస్తున్నారు!
మేము డిమాండ్ చేస్తున్నాం పేదవాడి ఆరోగ్యం బాగుపడాలంటే ఈ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలి!
ఈ నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మరియు యువతకు అభినందనలు తెలియజేశారు .






.jpg)


Comments
Post a Comment