వినియోగదారుల హక్కులను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి :

 వినియోగదారుల హక్కులను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి :



మురికిపూడి ప్రసాద్ 

కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు


మండలంలోని బొప్పూడి గ్రామంలో  ఉన్న పూసల సుబ్బయ్య,గుంటు వెంకటప్పయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ నందు గురువారం కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం *డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం* అనే అంశం ను ఈ సంవత్సరం థీమ్ గా నిర్దేశించిందని, విద్యార్థులు అందరూ వినియోగదారుల హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కన్జ్యూమర్ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు 2019 వినియోగదారుల చట్టం గురించి తెలియజేయాలని కోరారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా బిల్లును తీసుకోవాలని, వస్తువు కొనుగోల ద్వారా మోసపోయి నట్లయితే వెంటనే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ కు 1915 కు ఫోన్ చేసి సమస్యను తెలియపరచవచ్చునని, అత్యంత సులభంగా వాట్సాప్ ద్వారా కూడా వినియోగదారుల సమస్యలను ప్రభుత్వం స్వీకరించే ఏర్పాట్లు చేసిందని వాటి ద్వారా వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఆయన సూచించారు  . అనంతరం విద్యార్థులచే వినియోగదారుల ప్రతిజ్ఞ చేయించారు, తదుపరి వినియోగదాల సంఘం రూపొందించిన పోస్టర్ను హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు భవనం శ్రీనివాసరెడ్డి,ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులతో కలిసి వారు  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ ,ప్రధాన కార్యదర్శి రవి నాయక్ , కోశాధికారి బేబీ విక్రమ్, జాయింట్ సెక్రెటరీ పొన్నం శ్రీనివాసరావు, యం పుష్పవల్లి, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి