పెరిగిపోతున్న మట్టి, ఇసుక ,అక్రమ రవాణా*
*అన్నమయ్య జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాలలో రోజురోజుకు పెరిగిపోతున్న మట్టి, ఇసుక ,అక్రమ రవాణా*
*రాయచోటి పట్టణానికి చేరువలో ఉన్నటువంటి పెద్ద కాలవపల్లి యండపల్లి ఏరు వద్ద జెసిబి లు పెట్టి ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలింపు*....
*ఎక్కడపడితే అక్కడ చెరువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ జెసిబి లు పెట్టి మట్టి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు*......
*జెసిబి కి కానీ ట్రాక్టర్లకు కానీ నెంబర్లను కనిపించకుండా నెంబర్ బోర్డులను తొలగించి ఎద్దేంచగా మట్టిని తరలిస్తున్నారు*......
*ఇదిలా ఉంటే మరోవైపు తమకేమీ పట్టనట్టు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు*....
*గతంలో కొంతమంది విలేకరులు మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం ఇస్తే ఎమ్మార్వో గారు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇంకా యధావిధిగా కొనసాగుతున్న అక్రమ రవాణాలు....*

Comments
Post a Comment