గిరిజన రైతులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి
న్యూస్9 : చిలకలూరిపేట
*గిరిజన రైతులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి*
*గిరిజన సంఘాల నాయకులు.*
పెదకూరపాడు నియోజకవర్గ బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం, మోర్జంపాడుకు చెందిన గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేశారు.ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశాల్లో బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పి బ్యాంకుల వద్దకు వెళుతుంటే రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు.గిరిజన సంఘాల నాయకులు సోమవారం ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం సుమారుగా 3,000 మంది గిరిజన రైతుల పరిస్థితి ఆగమేగోచరంగా ఉందని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న కనీసం సమాధానం చెప్పడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు వినతి పత్రం అందజేశారు. సంబంధిత బ్యాంక్ అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులను పిలిచి వివరాలతో ఫైల్ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కోట నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్, పిడియం నాయకులు రామారావు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బి రాంబాబు నాయక్ తో పాటు రైతులు పాల్గొన్నారు.

Comments
Post a Comment