జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమ
న్యూస్ 9ఛానల్ :
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
3/2/2026
*ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది.
ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు*
ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ టెక్నాలజీకి విశేషమైన ప్రాధాన్యత పెరిగింది.
గ్రీన్ హైడ్రోజన్తో అమ్మోనియా తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి.
ఈ రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది.
ఈ నేపథ్యంలో జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమను స్థాపించాలని ముందుకొచ్చింది.
2025 జులై 18న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీ పరిశ్రమ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది.
సుమారు 300 ఎకరాల్లో రూ.35 వేల కోట్ల అంచనాతో భారీ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాలని ప్రయత్నాలు ప్రారంభించింది.
దీనికి సంబంధించిన ఎక్స్టెన్స్ సెంటర్ను ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని జేకే శ్రీవాస్తవ గ్రూప్ నిర్ణయించింది.
ఎస్ఆర్ఎం గ్రూప్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి నారాయణరావుతో ఈ మేరకు సంప్రదింపులు జరిపింది.
వచ్చే జులై 28న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్సిటీలో ఈ ఎక్స్టెన్స్ సెంటర్ను ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చారు.
మంగళవారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్, రీసెర్చ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు, జేకే శ్రీవాస్తవ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జేకే శ్రీవాస్తవ తదితరులు ఎక్స్టెన్స్ సెంటర్, కంపెనీల ఏర్పాటుపై వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వం భూకేటాయింపు జరిపాక పరిశ్రమ నిర్మాణప్రారంభిస్తామనీ,
రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించే కంపెనీలో 6 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని జేకే శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఎస్ఆర్ఎంలో ఏర్పాటు చేసే ఎక్స్టెన్స్ సెంటర్ ఆన్ హైడ్రోజన్ టెక్నాలజీస్ ద్వారా
గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీకి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
సముద్ర జలాలను నేరుగా డీశాలినేట్ చేసి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రక్రియకు అవసరమైన సాంకేతికత ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
సాంకేతికత అభివృద్ధికి అవసరమైన ఎక్విప్మెంట్ను జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా సమకూర్చనుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా యూనివర్సిటీలోని ముగ్గురు రీసెర్చ్ స్కాలర్స్కు కంపెనీ ఫెలోషిప్ అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం వర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది.
ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు.
పరస్పర సహకారంతో సెంటర్ ఏర్పాటు, రీసెర్చ్ కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైసఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ, పోలెండ్లోని అల్ట్రా గ్రీన్ సిలిండర్స్ డైరెక్టర్ అర్జూర్ కొలకౌసిగి, రాక్లిన్ కంపెనీ డైరెక్టర్ పోవెల్, ఎస్ఆర్ఎం ప్రొఫెసర్లు డాక్టర్ వినోద్, డాక్టర్ పార్థసారథి, డాక్టర్ సుజిత్ కల్లూరిలు పాల్గొన్నారు*ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది.
ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు*
ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ టెక్నాలజీకి విశేషమైన ప్రాధాన్యత పెరిగింది.
గ్రీన్ హైడ్రోజన్తో అమ్మోనియా తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి.
ఈ రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది.
ఈ నేపథ్యంలో జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమను స్థాపించాలని ముందుకొచ్చింది.
2025 జులై 18న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీ పరిశ్రమ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది.
సుమారు 300 ఎకరాల్లో రూ.35 వేల కోట్ల అంచనాతో భారీ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాలని ప్రయత్నాలు ప్రారంభించింది.
దీనికి సంబంధించిన ఎక్స్టెన్స్ సెంటర్ను ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని జేకే శ్రీవాస్తవ గ్రూప్ నిర్ణయించింది.
ఎస్ఆర్ఎం గ్రూప్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి నారాయణరావుతో ఈ మేరకు సంప్రదింపులు జరిపింది.
వచ్చే జులై 28న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్సిటీలో ఈ ఎక్స్టెన్స్ సెంటర్ను ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చారు.
మంగళవారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్, రీసెర్చ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు, జేకే శ్రీవాస్తవ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జేకే శ్రీవాస్తవ తదితరులు ఎక్స్టెన్స్ సెంటర్, కంపెనీల ఏర్పాటుపై వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వం భూకేటాయింపు జరిపాక పరిశ్రమ నిర్మాణప్రారంభిస్తామనీ,
రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించే కంపెనీలో 6 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని జేకే శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఎస్ఆర్ఎంలో ఏర్పాటు చేసే ఎక్స్టెన్స్ సెంటర్ ఆన్ హైడ్రోజన్ టెక్నాలజీస్ ద్వారా
గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీకి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
సముద్ర జలాలను నేరుగా డీశాలినేట్ చేసి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రక్రియకు అవసరమైన సాంకేతికత ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
సాంకేతికత అభివృద్ధికి అవసరమైన ఎక్విప్మెంట్ను జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా సమకూర్చనుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా యూనివర్సిటీలోని ముగ్గురు రీసెర్చ్ స్కాలర్స్కు కంపెనీ ఫెలోషిప్ అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం వర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది.
ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు.
పరస్పర సహకారంతో సెంటర్ ఏర్పాటు, రీసెర్చ్ కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైసఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ, పోలెండ్లోని అల్ట్రా గ్రీన్ సిలిండర్స్ డైరెక్టర్ అర్జూర్ కొలకౌసిగి, రాక్లిన్ కంపెనీ డైరెక్టర్ పోవెల్, ఎస్ఆర్ఎం ప్రొఫెసర్లు డాక్టర్ వినోద్, డాక్టర్ పార్థసారథి, డాక్టర్ సుజిత్ కల్లూరిలు పాల్గొన్నారు

Comments
Post a Comment