కరపత్రాలు పంపిణీ చేసిన వినియోగదారుల సంఘం నాయకులు
నరసరావుపేట సెంటర్లో వినియోగదారులకు కరపత్రాలు పంపిణీ చేసిన వినియోగదారుల సంఘం నాయకులు
న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినవద్దు... విష రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు
కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా జాయింట్ సెక్రటరీ బేబీ విక్రమ్
వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
చిలకలూరిపేట....................
న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన లేదా ఉంచిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి బేబీ విక్రమ్ వినియోగదారులకు తెలిపారు.
న్యూస్ పేపర్ తయారీలో ఉపయోగించే ఇంక్‌లో ఉండే రసాయనాలు, ముఖ్యంగా ప్రింటింగ్ ఇంక్‌లోని హానికర పదార్థాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని, అందువల్ల ఆహార పదార్థాలను పేపర్లో చుట్టడం లేదా ఉంచడం సురక్షితం కాదని తెలిపారు. ముఖ్యంగా వేడి పదార్థాలు, నూనె పదార్థాలు న్యూస్ పేపర్‌ను తాకినప్పుడు రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కూడా న్యూస్ పేపర్లను ఆహార ప్యాకింగ్ కోసం ఉపయోగించరాదని సూచించిందని తెలిపారు. వినియోగదారులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన ప్యాకింగ్‌లో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్, భాస్కర్ థియేటర్, కళ్యాణి హోటల్, రైతు బజార్ తదితర ప్రాంతాల్లో వినియోగదారులు ఎక్కువగా ఉండే చోట సంఘం నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019 గురించి, నాణ్యత లేని వస్తువులు, సేవలపై ఫిర్యాదు చేసే విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల వినియోగదారుల కోర్టులు ఇచ్చిన తీర్పుల సారాంశాన్ని కూడా వివరించారు.
ఈ సందర్భంగా కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ... ప్రతి వినియోగదారుడు తన హక్కులను తెలుసుకోవాలని, ఆహార భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వినియోగదారుల సంఘం తరఫున నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, ఎం పుష్పవల్లి, పొన్నం శ్రీనివాసరావు, గాలయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు.

Good prograamne
ReplyDelete