కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి


గీతా కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్


చిలకలూరిపేట..... న్యూస్ 9


*ఈరోజు చిలకలూరిపేటలో గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక నెల- ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కృత్తిక శుక్లా గారికి గీత కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ గీత కుల వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వృత్తిదారుల రక్షణకు, సంక్షేమానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రతి సంవత్సరము ఆదరణ పథకము-3 క్రింద వృత్తిదారులకు పనిముట్లు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ  రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు హామీ అమలుకు నోచుకోలేదు. వృత్తులలో గీత వృత్తి కత్తి మీద సాము లాంటిది మరియు అత్యంత సాహసోపేతమైనటువంటిది. కావున ఆదరణ-3 త్వరితగతిన అమలు చేసి వారికి ఇచ్చే పరికరాలు పూర్తి నాణ్యతతో, అధునాతనమైన పరికరాలు అందించి, వారి భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా చూసి ప్రమాదాలు నివారించే దశగా చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పరికరాలు అందేలా చూడాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా  50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత వృత్తిదారులకు పింఛన్ పథకాన్ని అమలు చేయాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బొర్రు నవీన్, దొంత గాని గోపి, గండు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది