ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు?
ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు?
ఇల్లు, స్థలం లేదా ఇతర ఆస్తి ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ అమ్మినప్పుడు కొత్త యజమాని పేరు నమోదు చేయడానికి కేవలం నామమాత్రపు ఫీజు తీసుకుంటే సరిపోతుంది ..కానీ ప్రస్తుతం భారతదేశంలో ప్రతి యాజమాన్య మార్పుజరిగినప్పుడు పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు ? ఒకే ప్రాపర్టీ మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎందుకు ?
ఒకే ప్రాపర్టీ అది ల్యాండ్ లేదా ఫ్లాట్ లేదా కారు అనుకుందాం . ఆ ప్రాపర్టీ మొదటిసారి కొన్నప్పుడు చట్టబద్ధత కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. అదే ఆస్తి పదేళ్లలో మూడు లేదా నాలుగు సార్లు చేతులు మారితే ప్రతి సారి లక్షల రూపాయల ఫీజులు ఎందుకు చెల్లించాలి?
ప్రభుత్వాల వాదన ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. కొత్త కొనుగోలుదారుడి హక్కులను చట్టబద్ధంగా నమోదు చేయడం, భవిష్యత్తులో వివాదాలు రాకుండా రికార్డులు నిర్వహించడం, ఆస్తి లావాదేవీలకు చట్టపరమైన రక్షణ కల్పించడం ఇందులో భాగం అని చెబుతున్నారు .. కానీ అందుకు లిమిటెడ్ చార్జెస్ వసూలు చేయొచ్చు .. కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే అందుకు రిజిస్ట్రేషన్ కోసమే 3-నుంచి ఏడు లక్షలవరకు రిజిస్ట్రేషన్ చార్జెస్ చెల్లించాల్సి వస్తుంది ..మధ్యతరగతి వాళ్లు ఏదైనా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ భారం ఎక్కువ పడుతోంది ..
స్టాంప్ డ్యూటీ రూంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తోంది ..ఆదాయం కోసం మధ్యతరగతి ప్రజలమీద భారం వేయకూడదు కదా ..
ఒక ఆస్తి ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంటే, తదుపరి యాజమాన్య మార్పుల సమయంలో కేవలం పేరుమార్పు ఫీజు లేదా పరిమిత సేవా రుసుము మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి సారి మార్కెట్ విలువ ఆధారంగా భారీ స్టాంప్ డ్యూటీ విధించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
డిజిటల్ యుగంలో భూ రికార్డులు, యాజమాన్య వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత సరళీకరించాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ప్రాపర్టీ యాజమాన్య మార్పుకు నామమాత్రపు ఛార్జీలు, సేవా రుసుములు మాత్రమే ఉండే విధానాన్ని భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంది ..

Comments
Post a Comment