రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:
మురికిపూడి ప్రసాద్
సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ
రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:
మురికిపూడి ప్రసాద్
సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
************
విజయవాడ........
పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకంలో నిబంధనలు పాటించలేదని, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నియామకాలు జరిగాయని సీఆర్పీఎఫ్‌ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ ఆరోపించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల (Consumer Voluntary Organisations) ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం. 8 ప్రకారం వినియోగదారుల వ్యవహారాలతో సంబంధం లేని వ్యక్తులను కొన్ని జిల్లాల కమిటీలో నియమించడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.ఈ నియామకాల ద్వారా రాజకీయంగా అవకాశాలు లేని వ్యక్తులకు పదవులు కల్పించినట్లు కనిపిస్తోందని, అయితే ఆ పదవులు పొందిన వ్యక్తుల పట్ల తమకు ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవకాశం కల్పించి ఉంటే విజిలెన్స్ కమిటీల ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశం నెరవేరేదని అభిప్రాయపడ్డారు.గత నెల 30న విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం.8 లో కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులను నియమించినట్లు, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయని పేర్కొనడం గమనార్హమని ప్రసాద్ అన్నారు. అయితే, నియమితులైన వ్యక్తులు వాస్తవంగా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులేనా అనే అంశాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 8ను పునఃసమీక్షించి, అవసరమైతే ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా కొత్త నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలు ఏకమై చట్టబద్ధమైన మార్గాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తాయని మురికిపూడి ప్రసాద్ తెలిపారు.

Comments
Post a Comment