స్వర్గీయ ఎస్ జానకమ్మ గారి స్వర నివాళి
అభినవ జానకి బెల్లంకొండ భారతి
చిలకలూరిపేట ......
విజయవాడలోని కౌతాపూర్ణ కళావేదికలో సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు డ్రీమ్ ఆడియో నిర్వహించిన స్వర్గీయ ఎస్ జానకమ్మ గారి స్వర నివాళి ఆకాశం ఏనాటిదో అనే శీర్షికతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖ గాయని బెల్లంకొండ భారతి కు ఘన సన్మానం అభినవ జానకి అనే బిరుదుతో సత్కరించడం జరిగింది . ఈ సందర్భంగా అనేక కళా సంస్థల అధినేతలు భారతిని పూలమాలలతో దృశ్యాలువలతో సత్కరించడం జరిగింది . సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ అధినేత బి.ఆర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాలలో 50 సాంస్కృతిక కళా సంస్థలు నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పాటల పోటీలలో ప్రథమ స్థానాలు పొందిన గాయని బెల్లంకొండ భారతీయని కొనియాడారు డ్రీమ్ ఆడియో అధినేత చావా నరసింహారావు మాట్లాడుతూ జానకమ్మ గారి స్వరంతో అంతే స్థాయిలో నీ లీల పాడెద దేవా, ఆకాశం ఏనాటిదో, గున్నమామిడి కొమ్మమీద, ఇది ప్రియ నర్తన హేళ, వెన్నెల్లో గోదావరి, పాటలను అద్భుతంగా ఆలపించిన బెల్లంకొండ భారతి అభినవ జానకిగా బిడ్డతో సత్కరించడం జరిగింది. సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ జానకమ్మ గారి చేత ప్రశంసలు పొందిన గాయని బెల్లంకొండ భారతీయ అని కొనియాడారు రిటైర్డ్ సీఐ డేవిడ్ రాజుగారు మాట్లాడుతూ బెల్లంకొండ భారతి ఉభయ రాష్ట్రాలలో పేరున్న మంచి గాయనీకాక, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసి ఎంఏ మ్యూజిక్ చేస్తున్నారని చాలా అంకితభావం గల గాయని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవి మ్యూజిక్ అకాడమీ రాజుగారు, డిజె టిల్లు అధినేత నాయక్ గారు, జానపద గాయకులు గణపతి కళాంజలి వ్యవస్థాపకులు రమేష్ గారు ఎస్సార్ సాంస్కృతిక సంస్థ మూర్తి రమణి దంపతులు, ప్రముఖ సీనియర్ గాయని విష్ణు ప్రియ సాయి దంపతులు, బాబురావు గారు ఇస్మాయిల్ గారు మొదలగు ప్రముఖులు పాల్గొని బెల్లంకొండ భారతిని సన్మానించడం జరిగింది

Comments
Post a Comment