వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలి కరపత్రాలు పంపిణీ చేసిన కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు చిలకలూరిపేట news9 వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, వినియోగదారుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ శనివారం స్థానిక నరసరావుపేట సెంటర్‌లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ధరలను అదుపులో ఉంచాలని కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ప్రతి ఒక్కరికీ భద్రత, వస్తువుల నాణ్యతపై సమాచారం పొందడం, ఎంపిక చేసుకోవడం, ఫిర్యాదు చేయడం, నష్టపరిహారం పొందడం వంటి హక్కులు ఉన్నాయని వివరించారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ప్యాకింగ్‌పై ఉన్న బరువు, ధర, తయారీ వివరాలను పరిశీలించాలని సూచించారు. బస్తాలపై ప్రకటించిన బరువుకు అన...